News March 5, 2025
మెదక్: మహిళపై అత్యాచారం.. ఆపై హత్య

హత్య కేసును గుమ్మడిదల పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బిక్య తండాకు చెందిన పూర్య 2024 DECలో కౌడిపల్లి మండలం కన్నారం శేరి తండాకు చెందిన కేతవత్ మునీ(38)ని కల్లు షాప్ నుంచి నల్లవల్లి అడవిలోకి తీసుకెళ్లాడు. అత్యాచారం చేసి, చున్నీ ఆమె గొంతుకు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. నేరస్థుడిని CC కెమెరాల ద్వారా గుర్తించి గుమ్మడిదల పోలీసులు పట్టుకున్నారు.
Similar News
News March 13, 2026
NGKL: ఆన్‌లైన్‌లో బుకింగ్.. ఏడాది దాటినా అందని ఇసుక

ఇసుక అక్రమ రవాణాను నియంత్రణ కోసం ప్రభుత్వం ఆన్‌లైన్ ఇసుక బుకింగ్ విధానం అమలు చేస్తుంది. మండల పరిధిలోని దుందుభి వాగు నుంచి ఇసుక సరఫరా చేయడానికి ఆన్‌లైన్ బుకింగ్ విధానం ప్రారంభమైందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కానీ మండల పరిధిలోని రాయిచేడికి చెందిన బాలకృష్ణ, జగదీష్‌లు ఏడాది క్రితం ఒకరు రూ.14,000 మరొకరు రూ.7000 చెల్లించి బుక్ చేశారు. ఏడాది అవుతున్నా ఇసుక రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News March 13, 2026
యుద్ధం.. చిత్తూరు జిల్లాలో నూనె ధరల పెంపు

యుద్ధం ప్రభావంతో వంటనూనెల ధరలు మండుతున్నాయి. చిత్తూరు జిల్లాలో బ్రాండెడ్ నూనెలు కిలో ప్యాకెట్‌పై రూ.10 పెంచారు. లూజ్ విక్రయాల్లోనూ లీటరుకు రూ.10 నుంచి రూ.20 వరకు పెంచారని తెలుస్తోంది. జనవరిలో సన్ ఫ్లవర్ ఆయిల్ రిటైల్ ధర రూ.150 ఉండగా, ప్రస్తుతం రూ.170 నుంచి రూ.175కు చేరింది. పామోలిన్ రూ.110 నుంచి రూ.130కి.. వేరుశనగ నూనె రూ.160 నుంచి రూ.175కు పెరిగింది.
News March 13, 2026
GNT: ఓ ఫొటోతో ఆగిన మ్యారేజ్.. యువతి, తల్లి సూసైడ్

బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల మేరకు.. సిరికొండ సుజాత(46) కుమార్తె దివ్య(26) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. మార్టూరు వాసి శేషుబాబుతో డిసెంబర్ 14న ఆమెకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. దివ్యకు పరిచయం ఉన్న ఓ యువకుడు ఆమెతో దిగిన ఫొటోను శేషుబాబుకు పంపాడు. దీంతో పెళ్లి ఆగిపోగా.. మనస్తాపంతో దివ్య, సుజాత ఈనెల 4న పురుగుల మందు తాగారు. గుంటూరులో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు.


