News March 5, 2025

విరాట్ కోహ్లీ మరో ఘనత

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచారు. ఇప్పటివరకు ఈ టోర్నీలో విరాట్ 746 పరుగులు చేశారు. ఈ క్రమంలో శిఖర్ ధవన్ (701) రికార్డును చెరిపేశారు. వీరి తర్వాత గంగూలీ (665), ద్రవిడ్ (627) ఉన్నారు. అలాగే 2000 తర్వాత వన్డేల్లో అత్యధిక సింగిల్స్ తీసిన ప్లేయర్‌గా కోహ్లీ (5,868) నిలిచారు. ఆయన తర్వాత సంగక్కర (5,688) ఉన్నారు.

Similar News

News March 6, 2025

ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు

image

తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు ఉ.8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయి. ఏప్రిల్ 23 వరకు ఇలాగే స్కూళ్ల టైమింగ్స్ కొనసాగుతాయి. టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లల్లో మాత్రం మధ్యాహ్నం పూట క్లాసులు జరుగుతాయి. అటు ఎండల తీవ్రత దృష్ట్యా ఈ నెల 15కు ముందే ఒంటిపూట బడులు నిర్వహించాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

News March 6, 2025

బ్యాంకులకు RBI శుభవార్త

image

నిధుల్లేక నైరాశ్యంతో ఉన్న బ్యాంకులకు ఉత్తేజం తెచ్చేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో రూ.2లక్షల కోట్లు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. సెక్యూరిటీల కొనుగోలు, డాలర్-రూపాయి స్వాప్ వంటి చర్యల ద్వారా నెల రోజుల్లో రూ.1.9లక్షల కోట్లు తీసుకురావాలని భావిస్తోంది. ఈ నెల 12, 18 తేదీల్లో రూ.1లక్షల కోట్లకు సమానమైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనుంది.

News March 6, 2025

బీజేపీలో జోష్.. కాంగ్రెస్‌లో నైరాశ్యం!

image

KNR-ADB-NZB-MDK జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ MLC స్థానాలను కైవసం చేసుకుని BJP జోష్‌లో ఉంది. రాష్ట్ర నేతలు సమష్టి కృషితో అంజిరెడ్డి, కొమురయ్యలను గెలిపించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ పట్టభద్రుల స్థానాన్ని కోల్పోయి INC నైరాశ్యంలో పడిపోయిందని సమాచారం. అక్కడ ఏడుగురు మంత్రులు, 23 మంది MLAలు ఉన్నా అంతర్గత కలహాలు కొంపముంచాయని తెలుస్తోంది.

error: Content is protected !!