News March 5, 2025
డ్వాక్రా మహిళలకు సర్కార్ తీపికబురు!

AP: రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు 5 శాతం వడ్డీతో రూ.లక్ష రుణం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పిల్లల చదువులు, వివాహాలు, ఇతర అవసరాల కోసం వీటిని అందించనుంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలకు సీఎంవో ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం ఏటా రూ.1,000 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. మహిళా దినోత్సవం రోజున సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.
Similar News
News March 6, 2025
కౌలు రైతులకు ‘అన్నదాత సుఖీభవ’: అచ్చెన్నాయుడు

AP: రాష్ట్రంలోని కౌలు రైతులకు కూడా ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రూ.20 వేలు ఆర్థిక సాయం ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. సీఆర్‌సీ కార్డులు లేకుండానే ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్నవారికి సాయం అందిస్తామన్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. అలాగే ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుకు బడ్జెట్‌లో రూ.9,400 కోట్లు కేటాయించామని వెల్లడించారు.
News March 6, 2025
పోసాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?

AP: నటుడు పోసాని కృష్ణమురళి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు సూర్యారావుపేట, భవానీపురం, మన్యం(D) పాలకొండ పోలీసులు ఆయనపై PT వారెంట్లు జారీ చేస్తున్నారు. మరోవైపు ఆయన్ను విచారణ చేసేందుకు ఆదోని పోలీసులు కర్నూలు కోర్టులో పిటిషన్ వేశారు. ఇవాళ ఈ పిటిషన్ విచారణకు రానుంది. మరోవైపు పల్నాడు జిల్లా నరసరావుపేట, అన్నమయ్య జిల్లా ఓబులాపురం పోలీసులూ కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది.
News March 6, 2025
బీజేపీలోకి సీఎం రేవంత్‌ను ఆహ్వానిస్తాం: అరవింద్

TG: CM రేవంత్ BJPలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని BJP MP ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయనను పార్టీలోకి తీసుకుంటారా? లేదా? అనేది తన చేతుల్లో లేదన్నారు. రేవంత్‌ను పదవి నుంచి తొలగిస్తారని జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఆయన అలా చేస్తే CM స్థాయిలో రేవంత్ చూస్తూ ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. అటు కేంద్రం నిధులిస్తున్నా కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యలను MP ఖండించారు.