News March 5, 2025

NGKL: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

image

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:05 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి నో ఎంట్రీ. గంట ముందే సెంటర్ లోకి అనుమతి. 8:45 గంటలకు విద్యార్థులకు ఓఎంఆర్ షీట్ అందజేత జిల్లా వ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాల ఏర్పాటు నిఘా నేత్రంలో ఎగ్జామ్స్ సెంటర్స్ జిల్లాలో నేడు మొదటి సంవత్సరం పరీక్ష రాయనున్న 6,477 మంది విద్యార్థులకు ALL THE BEST.

Similar News

News January 14, 2026

సంగారెడ్డి: ఆరు మున్సిపాలిటీల్లో తొలి సమరం

image

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పాటైన ఆరు మున్సిపాలిటీల్లో తొలిసారిగా ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ సందడి నెలకొంది. జిల్లాలోని గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం, ఇస్నాపూర్, ఇంద్రేశం, కోహిర్ పట్టణాలు పురపాలికలుగా రూపాంతరం చెందాక నిర్వహిస్తున్న మొదటి ఎన్నికలు ఇవే. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. స్థానిక ఓటర్లు మొదటిసారి పుర పోరులో పాల్గొని తమ ప్రతినిధులను ఎన్నుకోనున్నారు.

News January 14, 2026

నేడు మేడారంలో ‘గుడి మెలిగే’ పండగ

image

వనదేవతల మహాజాతరకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 13 రోజుల్లో జాతర ప్రారంభం కానుండగా, బుధవారం ‘గుడి మెలిగే’ పండగతో జాతర ఆచారాలకు శ్రీకారం చుట్టనున్నారు. సంప్రదాయం ప్రకారం జాతరకు రెండు వారాల ముందుగా పూజారులు దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నేటి నుంచి జాతర ప్రక్రియ అధికారికంగా మొదలైనట్లేనని భక్తులు భావిస్తారు. ఈ నెల 21న మండమెలిగే పండగ, 28న అమ్మవార్లు గద్దెపైకి చేరడంతో జాతర పతాక స్థాయికి చేరుకోనుంది.

News January 14, 2026

HYD: నగర శివారులో నయా పార్క్

image

నగరవాసులకు మరో ఆకర్షణీయమైన ఉద్యానవనం అందుబాటులోకి రానుంది. TG సాంస్కృతిక సంపద, కళాత్మక వైభవం ఉట్టిపడేలా శివారు తెల్లాపూర్‌లో ‘తెలంగాణ ట్రిబ్యూట్ గార్డెన్’ను అభివృద్ధి చేయడానికి HMDA కంకణం కట్టింది. 10 ఎకరాల్లో రూ.48 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కృష్ణా-గోదావరి వాటర్వేస్‌, కాకతీయ శిల్పకళతో పర్యాటక ఆకర్షణగా పార్కును తీర్చిదిద్దనున్నారు. ప్రభుత్వ అనుమతులు రాగానే పనులు ప్రారంభంకానున్నాయి.