News March 22, 2024

సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే?

image

CM పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే విద్యాశాఖ మంత్రి ఆతిశీ, వైద్యశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఈ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేజ్రీవాల్‌కు ఆతిశీ అత్యంత సన్నిహితురాలు. సౌరభ్ సైతం చురుగ్గా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లగలరనే పేరుంది. వీరికి తోడు కేజ్రీవాల్ సతీమణి సునీత పేరు కూడా వినిపిస్తోంది.

Similar News

News November 2, 2024

ఆస్ట్రేలియా Aతో మ్యాచ్.. సాయి సుదర్శన్ సెంచరీ

image

ఆస్ట్రేలియా A జరుగుతోన్న మ్యాచులో ఇండియా A ఆటగాడు సాయి సుదర్శన్ మెరిశారు. ఓపెనర్లు రుతురాజ్, అభిమన్యు ఈశ్వరన్ విఫలం కాగా సుదర్శన్ సెంచరీ చేశారు. మరో యువ బ్యాటర్ పడిక్కల్ 88 పరుగులతో రాణించారు. ఇషాన్ కిషన్ 32, నితీశ్ కుమార్ రెడ్డి 17 రన్స్ చేసి ఔటయ్యారు. ప్రస్తుతం ఇండియా A 199 పరుగుల ఆధిక్యంలో ఉంది.

News November 2, 2024

అమరావతి రైల్వే ప్రాజెక్టు భూసేకరణకు నోటిఫికేషన్

image

అమరావతి రైల్వే ప్రాజెక్టు భూసేకరణకు రైల్వేశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. TGలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు మధ్య కొత్త బ్రాడ్‌గేజ్ లైన్‌ నిర్మించనున్నారు. ఇందులో భాగంగా ఎర్రుపాలెం, కేసిరెడ్డిపల్లి గ్రామాల్లో భూసేకరణకు సంబంధించి షెడ్యూల్ ఇచ్చింది. భూమిని స్వాధీనం చేసుకోవడం, ఉపయోగించడంపై అభ్యంతరాలు ఉన్నవారు ఖమ్మం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు అభ్యంతరాలు తెలపాలంది.

News November 2, 2024

తెలంగాణలో భారీగా పెరిగిన పశుసంపద

image

TG: రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్లలో పశుసంపద భారీగా పెరిగిందని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ పేర్కొంది. దాదాపు రూ.2వేల కోట్ల వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. గుడ్ల ఉత్పత్తి రెట్టింపు కాగా మాంసం ఉత్పత్తిలోనూ గణనీయమైన అభివృద్ధి జరిగిందని వివరించింది. పశుసంపద, పాలు, గుడ్లు, మాంస ఉత్పత్తుల విలువ 2014-15లో రూ.2,824.57కోట్లు ఉండగా 2022-23 నాటికి అది రూ.4,789.09కోట్లుగా నమోదైనట్లు తెలిపింది.