News March 5, 2025

భూపాలపల్లి: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

మహాముత్తారం మండలానికి చెందిన ఓ బాలికపై 2019లో అత్యాచారానికి పాల్పడ్డ కేసులో మంగళవారం నిందితుడు అట్టెం మల్లయ్యకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానాను విధిస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టు న్యాయమూర్తి పి.నారాయణబాబు తీర్పు ఇచ్చారు. ఈ కేసులో జిల్లా స్పెషల్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ విష్ణువర్ధన్ రావు వాదనలు వినిపించగా పోలీసులు సాక్షాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో నిందితుడికి శిక్ష పడింది.

Similar News

News November 8, 2025

కరీంనగర్: స్నాతకోత్సవం సరే.. సమస్యల సంగతేంటి?

image

శాతవాహన యూనివర్సిటీ సమస్యలతో తల్లడిల్లుతున్నా పాలకుల నిర్లక్ష్యం కొనసాగుతోంది. 114 బోధన పోస్టులకు గాను 63, 51 బోధనేతర పోస్టులకు 9 మందితోనే నెట్టుకొస్తున్నారు. 47 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితోనే 12 విభాగాల్లోని 800 మంది విద్యార్థులకు బోధన నడుస్తోంది. నూతన ఇంజినీరింగ్, లా, ఫార్మసీ కళాశాలలకు గుర్తింపు రావాలంటే వెంటనే సిబ్బందిని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.

News November 8, 2025

KMR: లోన్ పేరుతో మోసం.. రూ.1.02 లక్షల టోకరా!

image

ఆన్‌లైన్ మోసంలో ఓ వ్యక్తి చిక్కుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. SI రాజశేఖర్ వివరాల ప్రకారం.. రామారెడ్డి(M) రెడ్డిపేట వాసి రాజు చరవాణికి వచ్చిన ముద్ర లోన్ ప్రకటన చూసి తన వివరాలు నమోదు చేయగా, ఓ వ్యక్తి ఫోన్ చేసి లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. లోన్ ప్రాసెసింగ్ ఫీజు పేరుతో బాధితుడి నుంచి 7 విడతలుగా రూ.1,02,960 బదిలీ చేయించుకున్నాడు. మోసపోయినట్లు తెలిసి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News November 8, 2025

NLG: అప్రెంటిషిప్‌కు దరఖాస్తు చేసుకోండి

image

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఐటీఐలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళాకు ఈనెల 10లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ అనుముల ప్రిన్సిపల్ మల్లిఖార్జున్ ఒక ప్రకటనలో తెలిపారు. www.apprenticeship.gov.in లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వివరాలకు 86868 80100, 83413 87860 నెంబర్లకు సంప్రదించాలని పేర్కొన్నారు.