News March 5, 2025
SRPT: నిప్పులు కురిపిస్తున్న భానుడు

సూర్యాపేట జిల్లాలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. నిప్పులు కక్కుతున్న ఎండలతో ‘భానుపురి’ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. మధ్యాహ్నం వేళ మరింత భగభగమండిపోతున్నాడు. దాంతో ఇటు వేడి.. అటు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. మంగళవారం జిల్లాలో 39 డిగ్రీలపైన పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం మద్దిరాల, ఆత్మకూరు(ఎస్), నూతన్‌కల్ మండలాల్లో 39.9 అధిక ఉష్ణోగ్రతలు నమోదైంది. కాగా.. రాష్ట్రంలోనే ఇవి అత్యధికం.
Similar News
News March 13, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 13, 2026
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్: కలెక్టర్

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ జనరల్ ఆసుపత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 15 ఏళ్లలోపు బాలికలందరికీ జనరల్, ఏరియా ఆసుపత్రుల్లో ఈ టీకాను ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని కోరారు.
News March 13, 2026
అల్లూరి: 4 మండలాల్లో 100 శాతం పన్నుల వసూళ్లు

ఉమ్మడి అల్లూరి జిల్లాలోని 4 మండలాల్లో 100శాతం ఇంటి పన్నులు వసూలు జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ గురువారం తెలిపారు. కొయ్యురు, హుకుంపేట, ముంచింగిపుట్టు, పోలవరం జిల్లాలో వై.రామవరం మండలాల్లో పూర్తి గా పన్నులు వసూలు అయ్యాయన్నారు. జిల్లాలో మొత్తం 430 పంచాయతీల్లో 373 పంచాయతీల్లో పన్నులు వసూళ్లు పూర్తి అయ్యిందన్నారు.


