News March 5, 2025
ఉప్పలగుప్తం : వాటర్ ట్యాంక్ ఎక్కి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ఉప్పలగుప్తానికి చెందిన విద్యార్థిని మంగళవారం వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అమలాపురం గాంధీనగర్ శివారులో ఈ ఘటన జరిగింది. ఆమె భీమవరంలో బీఫార్మసీ చదువుతోంది. చదువుపై శ్రద్ధ చూపకపోవడంతో తండ్రి మందలించాడని ఆత్మహత్యకు ప్రయత్నించింది. టౌన్ సీఐ వీరబాబు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై.. విద్యార్థిని కాపాడడంతో.. పెను ప్రమాదం తప్పింది.
Similar News
News July 7, 2025
ఇంజినీరింగ్ సీట్ల భర్తీపై ఉమ్మడి గుంటూరులో ఆసక్తి

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ ఏడాది ఏపీ ఈఏపీసెట్‌కు 33,063 మంది హాజరైన వారిలో 23,536 మంది అర్హత సాధించారు. జిల్లాలోని రెండు ప్రభుత్వ యూనివర్సిటీలు (ANUతోపాటు JNTU నరసరావుపేట) సహా 34 ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 32,240 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆదివారం విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం, 7 నుంచి 16వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌లు, 22న సీట్లు కేటాయించనున్నారు. అయితే అభ్యర్థుల కంటే సీట్లు ఎక్కువగా ఉన్నాయి.
News July 7, 2025
యాదాద్రి: మహిళలకు అబార్షన్.. పోలీసుల అదుపులో వైద్యుడు

భువనగిరి గాయత్రి ఆసుపత్రిలో ఇద్దరు మహిళలకు అబార్షన్ చేసిన ఓ డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు SI కుమారస్వామి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం అర్ధరాత్రి హాస్పిటల్‌కు వెళ్లి తనిఖీ చేయగా మహిళలకు అబార్షన్ చేసి అబ్జర్వేషన్‌లో ఉంచగా, డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్కానింగ్ చేసిన మరో డాక్టర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. మహిళలు ఇద్దరు యాదాద్రి జిల్లాకు చెందిన వారుగా తెలుస్తోంది.
News July 7, 2025
KU పరిధిలో 2,356 సీట్లు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 2,356 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరిధిలోని రెండు కాలేజీల్లో 780 సీట్లు ఉండగా.. నాలుగు ప్రైవేట్ కాలేజీల్లో 1,576 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 1,103 సీట్లను భర్తీ చేయనున్నారు. టీజీఎప్‌సెట్-2025 ఫస్ట్ ఫేజ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఈ నెల 8 వరకు అవకాశం ఉండగా.. వెబ్ ఆప్షన్లకు 10 వరకు గడువు ఉంది.