News March 5, 2025

మెక్సికో, కెనడాకు ట్రంప్ స్వల్ప ఊరట?

image

మెక్సికో, కెనడాపై విధించిన భారీ సుంకాల విషయంలో స్వల్ప మార్పులు చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. ఆ దేశాల విజ్ఞప్తుల్ని పరిగణించి టారిఫ్‌లను కొంత మేర తగ్గించొచ్చని US వాణిజ్య మంత్రి హొవార్డ్ లుత్నిక్ తెలిపారు. మరోవైపు.. తమ దేశాన్ని ఆక్రమించాలన్న ప్రణాళికతోనే ట్రంప్ భారీగా సుంకాల్ని విధించారని కెనడా PM జస్టిన్ ట్రూడో ఆరోపించడం గమనార్హం.

Similar News

News November 14, 2025

200 సీట్ల‌తో ఎన్డీయే గెల‌వ‌బోతుంది: CBN

image

AP: బిహార్‌లో ఎన్డీయే ఘ‌న విజ‌యం దిశగా దూసుకెళ్తుండటంపై CM చంద్ర‌బాబు స్పందించారు. విశాఖ CII పార్ట్‌నర్షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. 200 సీట్ల‌తో ఎన్డీయే గెల‌వ‌బోతుందని అన్నారు. ప్ర‌జ‌లంతా PM మోదీ వైపే ఉన్నారని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయన్నారు. దేశంలో ఇంత‌లా ప్ర‌జా న‌మ్మ‌కం పొందిన వ్య‌క్తి మోదీ త‌ప్ప మ‌రెవ‌రూ లేరని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ శతాబ్దం న‌రేంద్ర మోదీది అని కొనియాడారు.

News November 14, 2025

గోపీనాథ్ ‘లీడ్ బ్రేక్’ చేసిన నవీన్

image

జూబ్లీహిల్స్‌లో అంచనాలకు మించి నవీన్ యాదవ్ దూసుకెళ్తున్నారు. ఆయనకు 10 వేలకు అటు ఇటుగా మెజార్టీ రావచ్చని మెజార్టీ సర్వేలు చెప్పాయి. అయితే 9వ రౌండ్ ముగిసేసరికే 19వేల ఆధిక్యంలో ఉన్నారు. ఈ సెగ్మెంట్‌లో దివంగత MLA మాగంటి గోపీనాథ్ 2014లో 9,242, 2018లో 16,004, 2023లో 16,337 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సెగ్మెంట్లో అత్యధిక మెజార్టీ రికార్డ్ విష్ణు (2009లో కాంగ్రెస్ నుంచి 21,741 లీడ్) పేరిట ఉంది.

News November 14, 2025

AcSIRలో 16 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

అకాడమీ ఆఫ్ సైంటిఫిక్& ఇన్నోవేటివ్ రీసెర్చ్(<>AcSIR<<>>)లో 16 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్, Sr మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://acsir.res.in/