News March 5, 2025

NTR: ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్ల సంఖ్య ఇదే

image

ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించిన విషయంలో తెలిసిందే. ఈ ఎన్నికల్లో పట్టభద్రులు వేసిన ఓట్లు కొన్ని చెల్లలేదు. మొత్తం 26,679 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు. ప్రతి రౌండ్‌లోనూ 2 వేలకు పైగా చెల్లని ఓట్లు పడినట్లు తెలిసింది. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్‌లో కూడా 55 ఓట్లు చెల్లలేదు.

Similar News

News March 5, 2026

ASF: విద్యుత్ ద్వారా ప్రభుత్వానికి రూ. కోటి ఆదాయం

image

ASF జిల్లాలో వేసవి ప్రారంభంలోనే ఎండలు తీవ్రరూపం దాల్చాయి. ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్‌కు చేరడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఈనెల 3న రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 19,900 మెగావాట్ల వినియోగం నమోదైంది. జిల్లాలో 1,737 మెగావాట్ల వినియోగం జరిగినట్లు అధికారులు తెలిపారు. రోజుకు 17.35 లక్షల యూనిట్లు వినియోగమవుతూ ప్రభుత్వానికి సుమారు రూ. కోటి ఆదాయం లభిస్తోంది.

News March 5, 2026

కృష్ణా వర్శిటీ విద్యార్థులకు అలర్ట్

image

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో బీఈడీ, స్పెషల్ బీఈడీ, బీపీఈడీ, డీపీఈడీ చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 2,3,4వ సెమిస్టర్(వన్ టైం ఆపర్చునిటీ) పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 6 మధ్య నిర్ణీత తేదీలలో వర్శిటీ పరిధిలోని కళాశాలలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU అధ్యాపకులు తెలిపారు. సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు.

News March 5, 2026

ముగ్గురు సహచరులు – ఒక్కటే లక్ష్యం: నారా లోకేశ్

image

2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీలు సాధించిన ముగ్గురు నేతల (లోకేశ్, పల్లా, గంటా శ్రీనివాసరావు) అరుదైన ఫొటోను మంత్రి నారా లోకేశ్ పంచుకున్నారు. అత్యధిక ఓట్ల మెజారిటీ పొందిన ముగ్గురు సహచరులుగా.. ఈ గెలుపు తమపై ఉన్న గురుతర బాధ్యతను గుర్తు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రతిరోజూ పూర్తి నిబద్ధతతో, వినమ్రతతో ప్రజలకు సేవ చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.