News March 5, 2025
ASF: భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్

గత రెండు రోజుల క్రితం మండలం లోడుపల్లి గ్రామంలో వివాహిత అనుమానాస్పద మృతి విషయం తెలిసిందే. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించినట్లుగా సీఐ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఎంకపల్లి బస్టాండ్ వద్ద భర్త గణేశ్, అతని తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించానని చెప్పినట్లు SI కొమురయ్య తెలిపారు.
Similar News
News March 6, 2025
సంగారెడ్డి: మతిస్తిమితం లేని యువతిపై అత్యాచారం

మతిస్తిమితం సరిగ్గాలేని యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆందోల్ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువతి(24) చిన్ననాటి నుంచి మతిస్తిమితం లేక పోవడంతో కుటుంబీకులు ఆమెకు పెళ్లి చేయలేదు. యువతి ప్రతిరోజు గ్రామంలో అటు ఇటూ తిరిగి ఇంటికి చేరుకునేది. నాలుగు రోజుల క్రితం శంకర్ అనే యువకుడు మద్యం మత్తులో యువతిని పొలం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
News March 6, 2025
తెలంగాణలో చిత్తూరు యువకుడు సత్తా

తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నాల్గవ సౌత్ జోన్ షూటింగ్ బాల్ చాంఫియన్ షిప్ పోటీల్లో రామకుప్పం మండలంలోని బళ్లకు చెందిన విద్యార్థి మౌనిశ్ విశేష ప్రతిభ కనబరచాడు. సీనియర్ విభాగంలో ఇతను విజేతగా నిలిచాడు. ఇతను ఎస్వీయులో డిగ్రీ చదువుతున్నాడు. పోటీల్లో ప్రతిభ చాటిన మౌనిశ్ను బుధవారం స్థానిక టీడీపీ నేతలు మునస్వామి, నాగభూషణం, పట్ర నారాయణ, జయశంకర్, మునిరత్నం తదితరులు అభినందించారు.
News March 6, 2025
విజయవాడ: ‘సాఫ్ట్వేర్ ఉద్యోగి కాదు అమ్మాయిల బ్రోకర్’

నెల్లూరుకు చెందిన ఓ యువతికి ఆమె తల్లిదండ్రులు మ్యాట్రీమోని ద్వారా పెళ్లి సంబంధాలు చూస్తుండగా.. విజయవాడకు చెందిన అమీర్‌ఖాన్ పరిచయమయ్యాడు. తాను సాఫ్ట్వేర్ ఉద్యోగినని నమ్మించి రూ.15 లక్షల నగదు, 13 సవర్ల బంగారు కట్నకానుకుల కింద తీసుకున్నాడు. ఈ క్రమంలో భర్త అమీర్‌ఖాన్ అమ్మాయిల బ్రోకర్ అని తెలియడంతో భార్య ప్రశ్నించగా.. దాడి చేశాడు. దీంతో ఆమె నెల్లూరు చిన్నబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.