News March 5, 2025
పాలకుర్తి: ప్రమాదవశాత్తు పల్టీ కొట్టిన కారు

ప్రమాదవశాత్తు ఓ కారు పల్టీ కొట్టిన ఘటన పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామంలోని ఇటుక బట్టీల దగ్గర బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ కారు ప్రమాదవశాత్తు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో వాహనం ముందు భాగం నుజ్జు నుజ్జయింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 17, 2026
బెంగాల్‌లో ‘ఢిల్లీ కా లడ్డూ’ పని చేయదు: మమతా బెనర్జీ

బెంగాల్‌లో BJPకి గతం కంటే ఈసారి సీట్లు తగ్గుతాయని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఆటలాడినా ఆ పార్టీకి ఏ మాత్రం గెలిచే అవకాశం లేదన్నారు. ఈ ఎన్నికల్లో ‘బెంగాల్’ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో ‘ఢిల్లీ కా లడ్డూ’ పని చేయదని ఎద్దేవా చేశారు. కాగా WBలో మొత్తం 294 సీట్లకు గాను TMC 291 చోట్ల పోటీ చేస్తోంది. 3 సీట్లను మిత్రపక్షం BGPMకు కేటాయించింది.
News March 17, 2026
చీరాల: అత్యాచారం కేసులో నిందితుడికి జైలు

చీరాల నియోజకవర్గం వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అత్యాచార కేసులో నిందితుడికి న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. వేటపాలెం మండలానికి చెందిన 7 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడిన పిట్ల సూరిబాబుకు న్యాయస్థానం 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.5000ల జరిమానా విధించిందన్నారు. బాధితురాలికి రూ.75,000ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించిందని వివరించారు.
News March 17, 2026
నెల్లూరు జిల్లాకు 18 కొత్త మొబైల్ టవర్లు

నెల్లూరు జిల్లాలో నెట్‌వర్క్ లేని మారుమూల గ్రామాలు చాలా ఉన్నాయి. ఈక్రమంలో 18 కొత్త మొబైల్ టవర్లు మంజూరైనట్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో ఎంపీ చర్చించారు. దీంతో 2026 డిసెంబర్ నాటికి ఆత్మకూరు, కోవూరు, కందుకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఈ టవర్లను ఏర్పాటు చేయనున్నారు.


