News March 5, 2025

అచ్యుతాపురం: 175 సర్టిఫికెట్ కోర్సులు చేసిన విద్యార్థిని

image

అచ్యుతాపురం మండలం కోనెంపాలెంకు చెందిన బండారు ప్రవల్లిక గొల్లలపాలెం KGBVలో 10వ తరగతి చదువుతుంది. ఈమె చిన్న వయసులోనే 175 సర్టిఫికెట్ కోర్సులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్ఫోసిస్ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫారంలో హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, ఎలక్ట్రానిక్స్,ఏఐ వంటి వివిధ సర్టిఫికెట్ కోర్సులు చేసిందని ప్రిన్సిపల్ గంగాకుమారి తెలిపారు. ఛైర్మన్ చందపరపు కుమార్, ఇతర సిబ్బంది చిన్నారిని అభినందించారు.

Similar News

News March 26, 2026

సింగరేణి సిగలో సాంకేతిక మణిహారం..!

image

పెద్దపల్లి(D) రామగిరి(M) పెద్దంపేటలో 1979లో సింగరేణి ఆధ్వర్యంలో నిర్మాణం మొదలైంది. 1985 నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది. 1991లో లాంగ్వాల్ సాంకేతికతను ప్రవేశపెట్టారు. 1998లో GDK- 6Bలో భాగంగా ఉన్న ఈ మైన్‌ను 2009లో స్వతంత్రంగా “GDK-11 ఇన్‌క్లైన్”గా మార్చారు. దేశంలోనే “కంటిన్యూయస్ మైనింగ్” అధునాతన విధానాన్ని అనుసరిస్తున్న మూడు ప్రధాన గనులలో ఇదీ ఒకటి. ఇప్పటివరకు 20.5 MTల బొగ్గును వెలికితీశారు.

News March 26, 2026

సుప్రీంలీడర్‌గా ఉండమని ఇరాన్ కోరింది: ట్రంప్

image

ట్రంప్ వంటి వ్యక్తులతో అసలు చర్చలే చేయమని <<19472137>>ఇరాన్<<>> అంటున్న వేళ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంలీడర్‌గా బాధ్యతలు తీసుకోమని ఇరాన్ తనను అనధికారికంగా కోరిందని.. కానీ తనకు అవసరం లేదని ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించానని చెప్పుకొచ్చారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఓ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో వీలైనంత త్వరగా డీల్ చేసుకోవాలని ఇరాన్ కోరుకుంటోందని ఈ సందర్భంగా తెలిపారు.

News March 26, 2026

సత్యవేడులో దారుణం.. తల్లి చేతిలో బిడ్డ హత్య.?

image

సత్యవేడు(M) NRఅగ్రహారంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. హేమావతికి కొద్ది రోజుల కిందట ఆడబిడ్డ పుట్టింది. అయితే ఇవాళ ఆమె కూతురుని చంపేసింది. బిడ్డ తరుచూ పాల కోసం ఏడుస్తూ ఉండడంతో నచ్చక ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితురాలు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెను పోలీసులు విచారిస్తున్నారు.