News March 5, 2025

KNR: ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

image

ఉమ్మడి KNR, ADB, NZB, MDK ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో భాగంగా 11వ రౌండ్ తో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. 11వ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4935(75675), కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 4387(70565), బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 3473(60419) ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బీజేపీ అభ్యర్థి 5,110 లీడింగ్‌లో కొనసాగుతున్నారు.

Similar News

News March 4, 2026

నెల్లూరు: మహిళలకు ఆత్మరక్షణపై శిక్షణ

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సామూహిక ఆత్మరక్షణ శిక్షణ బుధవారం నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ Ch. సౌజన్య పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో కరాటే నిపుణులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆపద సమయాల్లో తమను తాము ఎలా కాపాడుకోవాలో మహిళలకు ప్రత్యక్షంగా వివరించారు.

News March 4, 2026

మన్యంకొండలో వైభవంగా అమ్మవారి ‘అశ్వవాహన’ సేవ!

image

మన్యంకొండ క్షేత్రంలో శ్రీ అలివేలు మంగతాయారు అమ్మవారి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. బుధవారం రాత్రి అమ్మవారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుద్దీప కాంతులు, మంగళవాయిద్యాలు, వేదఘోషల మధ్య ఈ సేవ వైభవంగా జరిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

News March 4, 2026

KNR: కెనాల్‌లో పడి యువకుడి మృతి

image

కెనాల్‌లో పడి యువకుడు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో జరిగింది. దేశరాజుపల్లి గ్రామానికి చెందిన వరాల రాకేష్(24) బుధవారం మిత్రులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం కొక్కెర కుంట శివారులోని ఎస్సారెస్పీ కాల్వలో కొంతమంది స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లారు. ఈత రాకపోవడంతో కెనాల్ నీటిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.