News March 5, 2025
ఇంటర్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలి: మంత్రి సీతక్క

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా పరీక్షలు రాయాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. బంగారు భవిష్యత్తుకు మరో అడుగు వేస్తున్న తరుణంలో లక్ష్యంపైనే విద్యార్థులు గురి పెట్టి ఉత్తమ ప్రతిభ కనబరచాలని విద్యార్థులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 3, 2025
శ్రీ శృంగేరి శంకర శారద పీఠాధిపతి మన పల్నాడు వారే.!

ఆది గురు శంకరాచార్యులు స్థాపించిన శృంగేరి శంకర శారద మఠ 36వ పీఠాధిపతి శ్రీ భారతి తీర్థానందస్వామి మన పల్నాడు జిల్లాకు చెందినవారే. ఆయన 1951లో దాచేపల్లి మండలంలో నాగులేరు ఒడ్డున ఉన్న అలుగు మల్లెపాడు గ్రామంలో వెంకటేశ్వర అవధాని, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. 9 సంవత్సరాలకే సంస్కృతంలో పట్టు సాధించిన స్వామి వేద విద్యలు అపోసన పట్టారు. మానవ సేవే మాధవ సేవ అని భావించి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
News November 3, 2025
గాంధారిలో 51మి.మీ. అత్యధిక వర్షపాతం

కామారెడ్డి జిల్లాలో కురిసిన అకాల వర్షం కారణంగా గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. గాంధారి 51 మి.మీ., బొమ్మన్ దేవిపల్లిలో 33, కొల్లూరు 28.5, బీబీపేట్ 21.5, నస్రుల్లాబాద్ 20.3, సదాశివనగర్ 16, సర్వాపూర్ 13.8, IDOC(కామారెడ్డి) 13, బీర్కూర్ 9.2, మక్దూంపూర్ 7, రామలక్ష్మణ పల్లి 5.8, ఆర్గొండ 5.2, మాచాపూర్ 4, హసన్పల్లి 3.8మి.మీ. నమోదయ్యింది.
News November 3, 2025
ఎటు చూసినా మృతదేహాలే..

TG: చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి <<18183773>>బస్సు<<>> ప్రమాద మృతుల బంధువుల ఆర్తనాదాలతో దద్దరిల్లిపోయింది. ఎటు చూసినా మృతదేహాలే కనిపిస్తుండడంతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. ఆసుపత్రిలో సరిపడా బెడ్లు లేకపోవడంతో క్షతగ్రాతులను బెంచ్‌లపై పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారని సమాచారం.


