News March 5, 2025

ఇంటర్ ఎగ్జామ్.. HYDలో భారీగా ట్రాఫిక్

image

ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. చింతల్ బస్టాండ్ నుంచి రిడ్జ్ టవర్స్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సైతం ఈ ట్రాఫిక్‌లో చిక్కుకోవడం గమనార్హం. సంబంధిత అధికారులు ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు క్లియర్ చేసేలా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. ఎగ్జామ్ సమయంలో ప్రధాన సర్కిళ్ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 

Similar News

News March 16, 2026

NZB: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: MP

image

నిజామాబాద్ జిల్లాలో రైతులు పండించిన మొక్కజొన్న పంటకు సంబంధించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని MPఅర్వింద్ ధర్మపురి కోరారు. జిల్లా కలెక్టర్‌కు ఆయన లేఖ రాశారు. జిల్లాలో ఈ ఏడాది పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట పండిందని అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర (MSP) రూ.2,400 ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేవన్నారు.

News March 16, 2026

పాలమూరు: సినీ నటులు, నేతలకు డ్రగ్స్ టెస్ట్ చేయాలి: MLA

image

సినీ నటులు డ్రగ్స్ పరీక్షలు చేయించుకుంటేనే వారి సినిమాలను విడుదల చేయాలని జడ్చర్ల కాంగ్రెస్ MLA అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ మూలాలు సినీ పరిశ్రమలోనే ఎక్కువగా ఉన్నాయని, పరీక్షలకు నిరాకరిస్తే మూవీ విడుదలను నిలిపివేయాలన్నారు. ప్రజాప్రతినిధులు కూడా ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్ట్ చేయాలని నిరాకరించే చట్టసభల్లోకి అనుమతించకూడదని ఆయన స్పష్టం చేశారు.

News March 16, 2026

అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు ఇంటి స్థలాలు: మంత్రి మండిపల్లి

image

రాయచోటి పట్టణంలో అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్‌లో పలువురు పాత్రికేయులు మంత్రిని కలిసి ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరగా.. మంత్రి వెంటనే తహశీల్దార్‌తో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకమని మంత్రి తెలిపారు.