News March 5, 2025

అత్తిలి: స్నేహితుల మధ్య ఘర్షణ.. హత్య

image

అత్తిలి మండలం దంతుపల్లిలో దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన జుత్తిగ వీరాంజనేయులు(35), కడలి వెంకటనారాయణ స్నేహితులు కాగా మంగళవారం కలిసి మద్యం తాగారు. ఈ సమయంలో ఇరువురి మధ్య ఘర్షణ జరగగా వీరాంజనేయులు తలపై వెంకటనారాయణ రాయితో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామ శివారులోని వీరాంజనేయులు మృతదేహం లభ్యం కావడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News March 12, 2026

భీమవరం: హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం

image

ఈ నెల 16 నుంచి 28 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో విద్యార్థులు హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారి గిరిధర్ కుమార్ తెలిపారు. ఇంటి నుంచి పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఈ సదుపాయం ఎంతో దోహదపడనుంది.

News March 12, 2026

రాష్ట్రంలోనే ప.గో. జిల్లాకు ఫస్ట్ ర్యాంకు

image

అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప.గో. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సర తృతీయ త్రైమాసికానికి సంబంధించి IVRS ద్వారా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లా 74.1 శాతం సానుకూలతతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా యంత్రాంగం సమిష్ఠిగా కృషి చేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు.

News March 12, 2026

ప.గో: గ్యాస్ పై జేసీ కీలక సూచనలు

image

జిల్లాలో వంటగ్యాస్‌ సిలిండర్ల కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని జేసీ రాహుల్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. బుధవారం గ్యాస్‌ ఏజెన్సీల నిర్వాహకులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వదంతులను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్‌ చేయవద్దని సూచించారు. సరఫరా సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.