News March 5, 2025
ADB: ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

ఉమ్మడి KNR, ADB, NZB, MDK ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో భాగంగా 11వ రౌండ్‌తో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 11వ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4,935 (75,675), కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 4,387 (70,565), బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 3,473(60,419) ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బీజేపీ అభ్యర్థి 5,110 లీడింగ్‌లో కొనసాగుతున్నారు.
Similar News
News March 4, 2026
తూ.గో: కూలికి వెళ్తుందని భార్యను నరికి చంపేశాడు..!

సీతానగరం(M) బొబ్బిల్లంకలో <<19285571>>డబుల్ మర్డర్<<>> జరిగిన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. కూలీ పనికి వెళ్తుండటం అవమానంగా భావించిన సీతారామరాజు (పండు), తన భార్య లత (35), అత్త లక్ష్మి (52)ను కత్తితో నరికి చంపాడు. సోమవారం రాత్రి జరిగిన ఈ దారుణానికి సంబంధించి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది.
News March 4, 2026
TTD ఛైర్మన్‌పై దుష్ప్రచారం.. కోర్టు గ్యాగ్ ఆర్డర్

తనపై జరుగుతున్న విషప్రచారంపై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేసిందని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ‘ఆధారరహిత కథనాలను ఇకపై ప్రసారం చేయకూడదని, ఇప్పటికే ప్రచురితమైన వాటిని తొలగించాలని కోర్టు ఆదేశించింది. TTD ప్రతిష్ఠను దెబ్బతీయాలనే కుట్రలో ఏఐ, మార్ఫింగ్ వీడియోలతో దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయి’ అని ఛైర్మన్ తెలిపారు.
News March 4, 2026
హనుమంతరాయ చౌదరి త్వరగా కోలుకోవాలి: మంత్రి లోకేశ్

తీవ్ర అస్వస్థతతో అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి త్వరగా కోలుకోవాలని మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. వైద్యుల కృషి, దేవుడి ఆశీస్సులతో ఆయన అనారోగ్యం నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మనమధ్యకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.


