News March 5, 2025
ADB: ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

ఉమ్మడి KNR, ADB, NZB, MDK ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో భాగంగా 11వ రౌండ్‌తో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 11వ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4,935 (75,675), కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 4,387 (70,565), బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 3,473(60,419) ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బీజేపీ అభ్యర్థి 5,110 లీడింగ్‌లో కొనసాగుతున్నారు.
Similar News
News September 18, 2025
జూబ్లీహిల్స్‌లో ‘కలర్ ఫొటో’కు అవకాశం?

త్వరలో బిహార్‌లో జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల కలర్ ఫొటోలను ఈవీఎంలలో ఉపయోగించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అమలు చేస్తారో? లేదో? కమిషన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే కలర్ ఫొటో గురించి ఇప్పటికే అన్ని రాష్ర్టాలకూ ఈసీ లేఖలూ రాసింది. ఇదే జరిగితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వాడే EVMలలో అభ్యర్థుల కలర్ ఫొటో చూసి ఓటేయవచ్చన్న మాట.
News September 18, 2025
KNR: జిల్లాస్థాయి “కళోత్సవ్” పోటీల్లో కలెక్టర్

KNR జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కళోత్సవ్ పోటీలను కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ కళా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. సంగీతం, నృత్యం, కథ, దృశ్య కళలు వంటి 12కేటగిరీల్లో పోటీలు జరుగుతున్నాయన్నారు. మండలస్థాయి పోటీల్లో గెలుపొందిన వారికి బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాస్థాయి పోటీలు ప్రారంభించారు.
News September 18, 2025
గుండ్లవాగులో ఘనంగా బతుకమ్మ వేడుకలు!

పువ్వుల పండుగకు వేలయ్యింది. ములుగు జిల్లా కేంద్రంలోని తోపుకుంట, రామప్ప జంగాలపల్లి, ఏటూరునాగారంలోని బొడ్రాయి, రామాలయం, బస్టాండ్ తాడ్వాయిలోని మేడారం, కాల్వపల్లి, మంగపేటలోని రాజుపేట, తిమ్మంపేట, గోవిందరావుపేటలోని పస్రా, గుండ్లవాగు, రాళ్లవాగు, దెయ్యాలవాగు, వెంకటాపురంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం, కన్నాయిగూడెం-రామాలయం, వాజేడులోని బొగత వద్ద బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. మీ గ్రామంలో వేడుకలు ఎక్కడ జరుగుతాయి?