News March 5, 2025
భూపాలపల్లి జిల్లాలో మండుతున్న ఎండ!

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లేవారు, ఇతర పనులకు వెళ్లే జిల్లా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 33 నుంచి 36 డిగ్రీలు, రేపు 33 నుంచి 36 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి.
Similar News
News January 14, 2026
కొందరి పౌరసత్వ నిర్ధారణ కోసం ఎన్నికల ప్రక్రియను ఆపలేము: ECI

పౌరసత్వం తేలేవరకు ఓటు హక్కును తొలగించవచ్చా? అని ECని SC ప్రశ్నించింది. SIR వ్యాజ్యంపై CJI సూర్యకాంత్, జస్టిస్ బాగ్చి విచారించారు. ‘పౌరసత్వంపై కేంద్రానికి నివేదించి EC నిర్ణయం తీసుకుంటుంది. అయితే కేంద్రం తేల్చే వరకు వేచి ఉండకుండా EC నిర్ణయం తీసుకోవచ్చు. ఓటరు పేరు తొలగించొచ్చు. దానిపై సదరు వ్యక్తి అప్పీలు చేయొచ్చు’ అని EC న్యాయవాది ద్వివేది కోర్టుకు తెలిపారు. దీనికోసం ఎన్నిక ప్రక్రియ ఆపలేమన్నారు.
News January 14, 2026
హనుమకొండ ఖాళీ.. నిర్మానుష్యంగా రోడ్లు!

సంక్రాంతి సందర్భంగా హనుమకొండ నగరం ఖాళీ అయింది. రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. పట్టణ ప్రజలంతా పండగ కోసం పల్లెబాట పట్టారు. నిత్యం రద్దీగా ఉండే హన్మకొండ చౌరస్తా, బస్టాండ్ ప్రాంతం, పెట్రోల్ పంప్ ఏరియా ఖాళీగా కనిపించింది. పట్టణ ప్రజలంతా గ్రామాల్లోకి వెళ్లడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
News January 14, 2026
భూపాలపల్లి: ఆన్లైన్లో సకినాలు ఆర్డర్..!

ఇంట్లో అప్పాలు, పిండి వంటలు చేయలేక ఆన్లైన్లో ఆర్డర్లు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు సంక్రాంతి వచ్చిందంటే పల్లెలతో పాటు పట్టణల్లో సందడిగా ఉండేది. సంక్రాంతి ముగ్గులతో పాటు సకినాలు ఫేమస్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పని చేతకాకనో, బిజీలైఫ్ వల్లో మొత్తానికి ఒక్క సంక్రాంతి పండగే కాక అన్ని పండగలకు అప్పాలు, పిండి వంటలు, హోమ్ ఫుడ్ లేదా ఆన్లైన్ ద్వారా ఆర్డర్లు చేస్తున్నారు. ఈజీగా అప్పాలు తినేస్తున్నారు.


