News March 5, 2025
హనుమకొండ జిల్లాలో మండుతున్న ఎండ

హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లేవారు, ఇతర పనులకు వెళ్లే జిల్లా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 33 నుంచి 35 డిగ్రీలతో పాటు.. మేఘావృతమై ఉంటుందని, రేపు 33 నుంచి 36 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి.
Similar News
News November 15, 2025
అయ్యప్ప స్వాములకు తప్పక తెలియాల్సిన ప్రాంతం

అయ్యప్ప స్వామితో యుద్ధంలో మహిషి అనే రాక్షసి మొండెం పడిన ప్రదేశాన్ని ‘ఎరుమేలి’ అని అంటారు. దీన్నే ‘కొట్టబడి’ అని పిలుస్తారు. శబరిమల యాత్రలో ఎరుమేలికి చేరుకున్న భక్తులు ‘స్వామి దింతకతోమ్… అయ్యప్ప దింతకతోమ్’ అని ‘పేటత్తుళ్లి’ అనే సాంప్రదాయ నృత్యం చేస్తారు. ఇది మహిషిపై సాధించిన విజయాన్ని గుర్తుచేస్తుంది. ఎరుమేలి అయ్యప్ప భక్తులకు ఓ ముఖ్యమైన ఆరంభ స్థానంగా, పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. <<-se>>#AyyappaMala<<>>
News November 15, 2025
179 పోస్టులకు నోటిఫికేషన్

సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (<
News November 15, 2025
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం జడ్పీ స్కూల్‌ను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి రోజు విద్యార్థి పాఠశాలకు వచ్చేలా చూడాలని, పాఠశాలకు రాని విద్యార్థుల ఇళ్లకు ఫోన్ చేసి పిలిపించాలని తెలిపారు. పది విద్యార్థులకు బోధించే టీచర్లకు అత్యవసరమైతే తప్ప సెలవులు ఇవ్వొద్దని HMకు సూచించారు.


