News March 5, 2025

నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

image

నారాయణపేట జిల్లా కేంద్రంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు గంట ముందుగానే చేరుకున్నారు. ప్రతి విద్యార్థిని హాల్ టికెట్లతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించకుండా, క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అధికారులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Similar News

News March 21, 2026

HYD: భట్టి కుమారుడి రిసెప్షన్‌లో సీఎం దంపతులు

image

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు మల్లు సూర్య విక్రమాదిత్య- సాక్షి వివాహ రిసెప్షన్ HYD శివారులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను రేవంత్ రెడ్డి దంపతులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతలు, సినీ వర్గాల ప్రముఖులు హాజరయ్యారు.

News March 21, 2026

అనంత: స్వగ్రామానికి మాజీ MLA భౌతికకాయం తరలింపు

image

కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అనంతపురంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లికి తరలించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. పూలమాలలు వేసి సంతాపం తెలిపారు.

News March 21, 2026

నల్గొండ రోడ్లకు ‘బడ్జెట్’ మొండిచేయి!

image

రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేశాయి. జిల్లాకు చెందిన నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి R&B శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ, సొంత జిల్లా రహదారుల అభివృద్ధికి బడ్జెట్‌లో ఆశించిన ప్రాధాన్యత దక్కలేదు. అధ్వాన్నంగా ఉన్న చిట్యాల-భువనగిరి, నల్గొండ -కొండమల్లేపల్లి వంటి రహదారుల విస్తరణకు నిధుల ప్రస్తావన ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. జిల్లావాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.