News March 5, 2025

SRPT: అంచనాల తారుమారుపై ఆలోచనలో యూటీఎఫ్!

image

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఎస్ యూటీఎఫ్ ఓటమితో ఆ యూనియన్ ఆలోచనలో పడింది. 2019 ఎన్నికల్లో గెలుపొందిన తాము ఈసారి ఎందుకు ఓడిపోయామనే చర్చ యూటీఎఫ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రెండో స్థానానికి పడిపోవడంపై యూనియన్ ఆలోచనల్లో పడింది. గెలుస్తామని ధీమాతో ఉన్నా అంచనాలు ఎక్కడ తారుమారయ్యాయి. ఓటమికి కారణాలేంటో విశ్లేషణ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 5, 2025

‘ఏటిమొగ-ఎదురుమొండి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తాం’

image

ఏటిమొగ-ఎదురుమొండి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని డీసీఎం పవన్ అన్నారు. బుధవారం ఆయన ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, ఇతర అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఏటిమొగ-ఎదురుమొండి బ్రిడ్జి నిర్మాణానికి రూ.109 కోట్ల నాబార్డు నిధులు మంజూరయ్యాయన్న పవన్.. అలైన్‌మెంట్‌లో మార్పుల కారణంగా మరో రూ.60 కోట్ల వ్యయం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారన్నారు.

News November 5, 2025

GET READY: మరికాసేపట్లో..

image

మరికొన్ని నిమిషాల్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా సా.6.49 గంటలకు చంద్రుడు భూమికి అతి సమీపంగా వచ్చి కనువిందు చేయనున్నాడు. సాధారణ రోజులతో పోలిస్తే భూమికి దగ్గరగా చంద్రుడు రావడంతో 14% పెద్దగా, 30% అధిక కాంతితో దర్శనమిస్తాడు. దీన్ని బీవర్ సూపర్ మూన్‌గా పిలుస్తారు. ఎలాంటి పరికరాలు లేకుండా ఈ దృశ్యాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉండండి.

News November 5, 2025

బాపట్లలో కారు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

image

బాపట్ల పట్టణంలోని మరుప్రోలు వారి పాలెం గ్రామ సమీపంలో గల జాతీయ రహదారిపై బుధవారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.