News March 5, 2025

ములుగు జిల్లాలో మండుతున్న ఎండ!

image

ములుగు జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లేవారు, ఇతర పనులకు వెళ్లే జిల్లా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 33 నుంచి 35 డిగ్రీలతో పాటు.. మేఘావృతమై ఉంటుందని, రేపు 33 నుంచి 36 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతవరణ సూచికలు చెబుతున్నాయి.

Similar News

News March 11, 2026

భద్రాచలం: మావోయిస్టులు.. పోలీసులకు మధ్య కాల్పులు

image

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పార్థాపూర్ ప్రాంతంలో బుధవారం భద్రతా బలగాలు, మావోయిస్ట్‌ల మధ్య భీకర ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్ట్‌లు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఎన్‌కౌంటర్ జరిగిన విషయాన్ని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నిఖిల్ రఖేచా ధ్రువీకరించారు. ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సమచారం.

News March 11, 2026

గద్వాల: పోలీసుల సంక్షేమమే లక్ష్యం.. ఎస్పీ ‘దర్బార్’

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం ఏఆర్ పోలీసులతో ‘పోలీస్ దర్బార్’ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందితో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను పోలీసులు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది సంక్షేమానికి తమ ప్రభుత్వం, శాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు.

News March 11, 2026

ఆ మందులతో లివర్ డ్యామేజీ: అధ్యయనం

image

ఆయుర్వేదం, ఇతర ప్రత్యామ్నాయ మందుల వాడకంపై తాజా అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడించింది. 386 రకాల ఉత్పత్తులను పరీక్షించగా 27.7% మందుల్లో స్టెరాయిడ్స్, 31.3% ఉత్పత్తుల్లో జంతు సంబంధిత వ్యర్థాలు ఉన్నట్లు ఇందులో తేలినట్లు ‘ఫ్రాంటియర్స్ ఇన్ గ్యాస్ట్రోఎంటరాలజీ’ ప్రచురించింది. వీటిలో సీసం, ఆర్సెనిక్ వంటి భార లోహాలు మోతాదుకు మించి ఉన్నాయని, వీటివల్ల 39% మందిలో కాలేయం పాడై మరణ ముప్పు పెరుగుతుందని తెలిపింది.