News March 5, 2025
ఏలూరు: 1000 ఓట్లు కూడా దాటని ఎమ్మెల్సీ అభ్యర్థులు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన 35 మంది అభ్యర్థులలో చాలా మందికి మూడంకెల స్కోరు కూడా దాటలేదు. మరికొందరికైతే 100 లోపు ఓట్లే పడ్డాయి. హేమ కుమారికి 956, వానపల్లి శివ గణేష్ 772, అసన్ షరీఫ్ 759, బండారు రామ్మోహన్ 709, చిక్కాల దుర్గాప్రసాద్ 665, కాట్రు నాగబాబు 565 ఇలా చాలా మంది అభ్యర్థులు 1000 మార్క్ కూడా టచ్ చేయలేకపోయారు.
Similar News
News March 21, 2026
Wah.. నగరమంతా నోరూరించే సువాసన

రంజాన్ అనగానే షీర్ ఖుర్మా గుర్తొస్తుంది. నగరమంతా దీని గుమగుమలతో నిండిపోతుంది. గల్లీల్లో దోస్తులందరినీ ఇంటికి పిలిచి దావత్ ఇచ్చి ఆఖరున షీర్ ఖుర్మాతో నోరు తీపి చేస్తారు. ఈ షీర్ ఖుర్మాకు ప్రత్యేకత ఉంది. పాలను బాగా మరిగించి ఖర్జూరాల తీపితో చేసే ఈ డెజర్ట్ తక్షణ శక్తినిస్తుంది. దీంట్లోని కాల్షయం, ప్రోటీన్లు ఎముకలను బలపరిచి, జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయని నిపుణుల మాట.
News March 21, 2026
కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో 5 ఏళ్ల బాలుడి మృతి

సిద్దిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతిచెందాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన రాములు, భారతి దంపతులకు వైష్ణవి, గంగారాం(5) పిల్లలు ఉన్నారు. ఉపాధి కోసం వచ్చిన రాములు ఫ్యామిలీతో కలిసి సిద్దిపేట 16వ వార్డులో ఉంటున్నారు. శుక్రవారం గంగారాం తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. సిద్దిపేట ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
News March 21, 2026
జగిత్యాల: జీవన్ రెడ్డి 25న కీలక భేటీ… నిర్ణయం ఖాయం?

మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈనెల 25న తన అనుచరులతో కలిసి రాజీనామా చేసే అవకాశముంది. జగిత్యాలలోని ఓ గార్డెన్‌లో మూడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం సమూహంగా పార్టీతో పాటు పదవులకు రాజీనామా చేసే అవకాశముందని తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణపై కూడా అదే రోజు స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.


