News March 5, 2025

గద్వాల జిల్లాలో భానుడి భగభగలు

image

గద్వాల జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నందున ఫ్యాన్లు, కూలర్లు వాడకం పెరిగింది. దీంతో విద్యుత్ వినియోగం పెరిగిందని విద్యుత్ అధికారులు తెలుపుతున్నారు. మంగళవారం గరిష్ఠంగా అలంపూర్, ద్యాగదొడ్డి, రాజోలి, మల్దకల్‌లో 38.9°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక గద్వాల్‌లో 38.6, చిన్న తాండ్రపాడు, సాతర్ల, ధరూర్ లో 38.5°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News December 24, 2025

అన్నమయ్య: 7 గవర్నమెంట్ ఉద్యోగాలు వద్దనుకుని..!

image

అన్నమయ్య జిల్లా కలకడకు చెందిన రాజా పవన్ కుమార్ 7ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వాటికి సంతృప్తి చెందక SIగా సెటిలయ్యారు. 2022లో B.Tech పాసయ్యాడు. ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ హవల్దారుగా ఉద్యోగం సాధించారు. 2023లో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జూ.అసిస్టెంట్‌గా కొంతకాలం పనిచేశారు. ఎస్ఐ నోటిఫికేషన్ రావడంతో అహర్నిశలు కష్టపడి పీఎస్ఐగా ట్రైనింగ్ పూర్తి చేసి తిరుపతి జిల్లా భాకరాపేట SIగా చేరారు.

News December 24, 2025

పడమర దిశలో తల పెట్టి నిద్రపోతున్నారా?

image

ఆరోగ్యంగా ఉండాలంటే సరైన దిశలో నిద్రపోవాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పడమర దిశలో తల పెట్టి, తూర్పు వైపు కాళ్లు చాపి పడుకుంటే మగత నిద్ర వస్తుందని, ఇది అనారోగ్యానికి కారణమవుతుందని అంటున్నారు. ‘ఈ దిశలో నిద్రిస్తే పీడకలలు, అర్ధరాత్రి మెలుకువ రావడం వంటి సమస్యలు రావొచ్చు. సరైన నిద్ర లేకపోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. పనులపై అనాసక్తి, నిరుత్సాహం కలుగుతాయి’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News December 24, 2025

సీఎంలు చంద్రబాబు, రేవంత్ క్రిస్మస్ విషెస్

image

ప్రజలకు ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు చూపిన ప్రేమ, క్షమ, సహనం, సేవ వంటి విలువలు ఈనాటి సమాజానికి మరింత అవసరమని CBN అన్నారు. ఏసు బోధనలను అనుసరించి అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రేవంత్ తెలిపారు. అటు BRS చీఫ్ కేసీఆర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.