News March 5, 2025

కృష్ణా: ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్ల సంఖ్య ఇదే

image

ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించిన విషయంలో తెలిసిందే. ఈ ఎన్నికల్లో పట్టభద్రులు వేసిన ఓట్లు కొన్ని చెల్లలేదు. మొత్తం 26, 679 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు. ప్రతి రౌండ్‌లోనూ 2 వేలకు పైగా చెల్లని ఓట్లు పడినట్లు తెలిసింది. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్‌లో కూడా 55 ఓట్లు చెల్లలేదు.

Similar News

News March 6, 2025

గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ 

image

వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా వంశీ ఉన్నారు. వంశీని మరో 10 రోజుల పాటు కస్టడీకి కోరుతూ పోలీసులు విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో వంశీ సరిగ్గా సహకరించలేదని పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న వ్యక్తులు పరారీలోనే ఉన్నారు. 

News March 6, 2025

కృష్ణా జిల్లాలో 39.9 డిగ్రీల ఎండ 

image

కృష్ణా జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఎండ మండిపోయింది. ముఖ్యంగా కంకిపాడులో 39.9 నమోదు కాగా.. బాపులపాడు, గన్నవరం, పెనమలూరులలో 39 డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో ఉన్నదాని కంటే నాలుగు శాతం ఉష్ణోగ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 

News March 6, 2025

క‌ృష్ణా: ‘మహిళ దినోత్సవ వేడుకలపై సమావేశం’

image

అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకులపై కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్‌లో పలు శాఖాధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. మార్చి 8వ తేదీన ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆయనతో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, యంత్రాంగం  మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహణపై చర్చించారు. 

error: Content is protected !!