News March 5, 2025

తణుకు మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు మృతి

image

తణుకు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు(86) బుధవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొలినాళ్లలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ తరపున 1983లో పోటీ చేసి వెంకటేశ్వరరావు గెలుపొందారు. ఆ తర్వాత మళ్లీ పోటీ చేయలేదు. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఈయన మృతి పట్ల తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ముళ్ళపూడి వెంకటకృష్ణారావు సంతాపం తెలిపారు.

Similar News

News January 4, 2026

ప.గో: అక్క అనే పిలుపునకు అండగా నిలిచి.. తలకొరివి పెట్టి మానవత్వం చాటి..

image

రక్త సంబంధం లేకపోయినా చిన్న పిలుపుతో ఏర్పడిన అనుబంధం మానవత్వాన్ని చాటింది. బ్రాడీపేటకు చెందిన కొరటాని శ్రీను(45) శనివారం అనారోగ్యంతో మృతి చెందగా, బంధువులు ఎవరూ రాలేదు. దీంతో శ్రీను ‘అక్క’ అని పిలిచే పొరుగున ఉన్న పతివాడ మావూళ్లమ్మ చలించిపోయింది. తానే స్వయంగా తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ఆమె చూపిన ఈ చొరవను చూసి స్థానికులు కంటతడి పెట్టుకుంటూ, మావూళ్లమ్మ పెద్దమనసును అభినందించారు.

News January 4, 2026

బీజేపీ జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలిగా సత్యవతి

image

బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నరసాపురానికి చెందిన గన్నాబత్తుల సత్యవతిని నియమించారు. పార్టీ బలోపేతానికి, మహిళా సమస్యల పరిష్కారానికి ఆమె చేస్తున్న కృషిని గుర్తించి పార్టీ ఈ బాధ్యతను అప్పగించింది. సత్యవతి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అగ్ర నాయకత్వానికి, జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను జిల్లాలోని ప్రతి మహిళకు చేరేలా చూస్తానన్నారు.