News March 5, 2025

ఇంటర్ పరీక్ష వేళ పరిసరాల జిరాక్స్ సెంటర్ల బంద్ చేయాలి: సీపీ

image

ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో పరీక్ష కేంద్రాల సమీపంలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉండవద్దని సీపీ అంబర్ కిషోర్ ఝా అదేశించారు. ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులతో పాటు ఇన్విజిలెటర్ల వద్ద ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా జాగ్రత్త పడాలన్నారు. ముఖ్యంగా పరీక్ష కేంద్ర పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News March 23, 2026

మీ పిల్లలకు తప్పక నేర్పించండి!

image

పిల్లలకు ముఖ్యంగా 12ఏళ్ల లోపు <<19447164>>చిన్నారులకు<<>> తల్లిదండ్రులు రోడ్డు భద్రతా నియమాలు నేర్పించాలి. వీలైనంత వరకు జీబ్రా లైన్స్ వద్ద రోడ్డు దాటాలని.. ఎడమ, కుడి 2 వైపులా చూడాలని చెప్పాలి. వాహనాల వేగాన్ని గమనిస్తూ ఇప్పుడు రోడ్డు దాటడం సేఫేనా, ఆగుదామా? అని ఆలోచించాలని వివరించాలి. ఉన్నట్టుండి రహదారిపై పరిగెత్తడం, దూకడం చేయకూడదని నేర్పాలి. రోడ్డు దాటే టైమ్‌లో ఫోన్ వాడటం/హెడ్‌ఫోన్లు పెట్టుకోవద్దని హెచ్చరించాలి.

News March 23, 2026

జగిత్యాల: వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి

image

జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న 2 వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఇబ్రహీంపట్నం (M) భర్తీపూర్ గ్రామానికి చెందిన చెట్టి <<19447475>>వెంకటేశ్<<>> (25) చేపల వేట కోసం గోదావరి నదికి వెళ్లి, ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన జగిత్యాలకు చెందిన <<19450885>>వొద్ది హనుమండ్లు<<>> (54) KNR ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

News March 23, 2026

భూలోకానికి వచ్చిన శ్రీవారు.. కారణం ఇదే.!

image

కలియుగ ప్రారంభంలో వేంకన్న వైకుంఠం వీడి భూలోకంలోని వెంకటాచలం వచ్చారట. భూ వరాహ స్వామి గుర్తించి ఆరాతీశారు. తన వక్షస్థలంపై భృగుమహర్షి పదప్రహరము చేయడంతో లక్ష్మీదేవి వైకుంఠం వీడి కొల్హాపురం వెళ్లిపోయిందని, ఆ దుఃఖంతో తాను పుట్టలో నివసిస్తున్నానని శ్రీనివాసుడు చెప్పాడట. ఇక్కడే నివాస స్థలమును ఇవ్వమని వేంకన్న భూ వరాహునిని కోరగా ధనం ఇచ్చినచో స్థలం ఇచ్చెదనని వరాహ స్వామి పేర్కొన్నారట. <<19452550>>NEXT<<>>