News March 5, 2025
ఇంకేం చేస్తే నన్ను నమ్ముతారు?: కేఎల్ రాహుల్

ప్రతి సిరీస్ ఆరంభానికి ముందు జట్టులో తన చోటు గురించి చర్చ జరగడంపై KL రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒక సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన తర్వాత కూడా మరో సిరీస్ మొదలయ్యే ముందు జట్టులో నా చోటు గురించి చర్చ జరుగుతుంటుంది. బ్యాటింగ్ ఆర్డర్లో జట్టు అవసరాల మేరకు కెప్టెన్ ఏం చెబితే అది చేశాను. ఇంకా ఏం చేస్తే ఈ చర్చ ఆగుతుంది? రోహిత్ మాత్రం నాకు ఎప్పుడూ అండగా ఉన్నారు’ అని తెలిపారు.
Similar News
News January 19, 2026
6 గంటలకుపైగా విజయ్‌ను విచారించిన సీబీఐ

కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ దళపతిని సీబీఐ రెండోసారి విచారించింది. సుమారు 6 గంటలకు పైగా అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఈ నెల 12న విజయ్ మొదటిసారి అధికారుల ముందు హాజరయ్యారు. అప్పుడు దాదాపు 7 గంటలపాటు ప్రశ్నించారు. అయితే ఆరోజు ఆయనను సాక్షిగా ప్రశ్నించగా, ఇవాళ అనుమానితుడిగా ఇంటరాగేషన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో సీబీఐ తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.
News January 19, 2026
డిజిటల్ మీడియా ఫిల్మ్ టెక్నాలజీకి ప్రోత్సాహం: CBN

AP: డిజిటల్ మీడియా, వర్చువల్ ప్రొడక్షన్, గేమింగ్, యానిమేషన్, ఫిల్మ్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్టు CM CBN పేర్కొన్నారు. జూరిచ్‌లో ‘ఈరోస్ ఇన్నోవేషన్’ ఛైర్మన్ కిషోర్ లుల్లా, ప్రతినిధులు CMతో భేటీ అయ్యారు. AI, జెన్ AI, డీప్ టెక్, డిజిటల్ కంటెంట్ ఎకానమీ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు. ఈరోస్ ఏఐ ఆధారిత ఫిల్మ్ సిటీ, ఏఐ క్రియేటివ్ టెక్ హబ్ తదితరాల గురించి వారు CBNకు వివరించారు.
News January 19, 2026
BJP కొత్త అధ్యక్షుడి ఘనత ఇదే

BJP జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ బిహార్ నుంచి ఈ పదవికి చేరిన తొలి నేతగా, అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. బంకీపూర్ ఎమ్మెల్యేగా 4 సార్లు, పట్నా వెస్ట్ నుంచి ఒకసారి విజయం సాధించిన ఆయన బిహార్‌లో రహదారుల శాఖ మంత్రిగా పనిచేశారు. BJP యువ మోర్చా అధ్యక్షుడిగా, ఛత్తీస్‌గఢ్ ఇన్‌ఛార్జ్‌గా అనుభవం ఉంది. కష్టపడి ఎదిగిన నేతగా పేరొందారు.


