News March 22, 2024

గన్నవరంలో మాధవిరెడ్డి, వైసీపీ కార్యకర్తలకు వాగ్వాదం

image

గన్నవరం YCP కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. TDP నిర్వహించనున్న వర్క్‌షాపులో పాల్గొనేందుకు కడప TDP ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి విజయవాడ వచ్చారు. గన్నవరం మీదుగా వెళ్తూ అక్కడి వైసీపీ కార్యాలయం వద్ద బ్యానర్లను ఫొటోలు తీస్తుండగా ఆ పార్టీ కార్యకర్తలు గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న TDP కార్యకర్తలు అక్కడకు చేరుకోగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Similar News

News April 9, 2025

పులివెందుల: MLC V/S మాజీ MLC

image

కడప జిల్లాలో TDPని బలోపేతం చేయాలనే ఆ పార్టీ పెద్దల ఆకాంక్ష.. స్థానిక నేతల వర్గపోరుతో తీరేలా కనిపించడం లేదు. ఈ మధ్య కాలంలో మాజీ MLC బీటెక్ రవి, MLC రాంగోపాల్ రెడ్డి వర్గీయుల మధ్య ఆధిపత్యం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల వీరి వర్గీయులు ఘర్షణలకు దిగారు. మంగళవారం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత ఎదుటే ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగారు. దీంతో జిల్లా TDP సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

News April 8, 2025

ఒంటిమిట్ట: కళ్యాణోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

image

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో నిర్వహించబోయే కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశం నిర్వహించారు. కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఎక్కడా ఇబ్బందులు జరగకుండా పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు.

News April 8, 2025

అరటి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి సవిత

image

ఇటీవల కురిసిన వర్షానికి అరటిపంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సవిత పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జేసీ అతిధి సింగ్‌తో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందించే విధంగా నివేదికలు తయారు చేయాలని సూచించారు.

error: Content is protected !!