News March 5, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధర!

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.550 పెరిగి రూ.80,650లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.600 పెరగడంతో రూ.87,980లకు చేరింది. కాగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ రూ.1,07,000 వద్ద కొనసాగుతోంది. వివాహాది శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.
Similar News
News December 31, 2025
డాంగ్ టావో కోడి.. కేజీ మాంసం రూ.1.50 లక్షలు

‘డాంగ్ టావో’ వియత్నాంకు చెందిన కోడి. దీని ఆకారం చాలా వింతగా ఉంటుంది. ఈ కోడి పాదాలు కాస్త లావుగా ఉంటాయి. వియత్నాం రెస్టారెంట్లలో ఈ కోడి మాంసం చాలా స్పెషల్. ఇక్కడి ప్రజలు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ కోడి మాంసాన్ని తినకపోతే తప్పుగా భావిస్తారు. అందుకే ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా ఈ కోడి మాంసాన్ని తింటారు. ఇంత డిమాండ్ వల్లే ఈ మాంసం కిలో దాదాపుగా రూ.1.50 లక్షలుగా ఉంటుంది. సీజన్ బట్టి ధరల్లో మార్పు ఉంటుంది.
News December 31, 2025
నిమ్మకాయ దీపం వెలిగిస్తూ చదవాల్సిన మంత్రాలు..

‘ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే’ అనే మంత్రం పఠిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ‘సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే’ శ్లోకాన్ని చదువుతూ దీపం వెలిగిస్తే కోరికలు నెరవేరుతాయి. ఇవి మనసులో సాత్విక భావనను పెంచి, ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి శాంతిని చేకూరుస్తాయి. దీపారాధన చేసే సమయంలో ఏకాగ్రతతో అమ్మవారిని స్మరించడం వల్ల సంపూర్ణ ఫలితం లభిస్తుంది.
News December 31, 2025
110 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (<


