News March 5, 2025
వరంగల్ నేటి మార్కెట్లో మిర్చి ధరల వివరాలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల మిర్చి ధరలు ఎలా ఉన్నాయి. నిన్న క్వింటా తేజ మిర్చి ధర రూ.14,200 ధర పలకగా.. నేడు రూ.14,000కి పడిపోయింది. అలాగే 341 రకం మిర్చికి సోమవారం రూ.14,100 ధర రాగా.. నేడు రూ. 14,600కి పెరిగింది. మరోవైపు వండర్ హాట్(WH) రకం మిర్చి నిన్న రూ.17,200 ధర పలకగా.. ఈరోజు రూ.16,800 ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు.
Similar News
News March 25, 2026
WGL: జాతీయ గ్రామీణ ఉపాధి పనులపై కలెక్టర్ సమీక్ష

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల్లో ఇంకా అసంపూర్తిగా ఉన్న వాటి పురోగతిపై కలెక్టర్ డా.సత్య శారద అధ్యక్షతన బుధవారం సమీక్షించారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్లో కొన్ని పూర్తికాకుండా ఉండటానికి గల కారణాలను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను మండలాల వారీగా గుర్తించి పూర్తి చేయాలన్నారు.

IBC సవరణ బిల్లుపై లోక్‌సభలో కడియం కావ్య గళమెత్తారు

IBC సవరణ బిల్లు–2025పై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లు ప్రజల డబ్బును రక్షించేలా లేదని, హెయిర్‌కట్స్ పెరిగి ప్రమోటర్లు బాధ్యత తప్పించుకుంటున్నారని అన్నారు. NCLTలో ఖాళీలు ఉన్నపుడు 14 రోజుల టైమ్‌లైన్ సాధ్యం కాదని ప్రశ్నించారు. మోసాలపై కఠిన చర్యలు లేవని ఆందోళన వ్యక్తం చేస్తూ, బిల్లును పునఃపరిశీలనకు పంపాలని డిమాండ్ చేశారు.