News March 5, 2025

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి 

image

భద్రాద్రి కొత్తగూడెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దమ్మపేటలో ఇస్త్రీ చేస్తుండగా కోకిల(28) అనే మహిళ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చికిత్స కో‌సం సత్తుపల్లి తరలిస్తుండగా మార్గ మధ్యంలో  మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News March 23, 2026

ఖరీఫ్‌కు కష్టమే.. తగ్గిన యూరియా తయారీ!

image

హార్ముజ్ జలసంధి మూతపడటంతో భారత్‌కు రావాల్సిన LNG సరఫరా నిలిచిపోయింది. దీంతో దేశీయంగా యూరియా ఉత్పత్తి 50% పైగా పడిపోయింది. గ్యాస్ కొరత వల్ల గెయిల్, IOC వంటి సంస్థలు యూరియా ప్లాంట్లకు సప్లై తగ్గించాయి. ఫలితంగా వచ్చే ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన 170-180 లక్షల టన్నుల యూరియా లభ్యతపై ఆందోళన మొదలైంది. ప్రస్తుతం దేశంలో కేవలం 62 లక్షల టన్నుల నిల్వలు మాత్రమే ఉన్నాయి. చైనా నుంచి కూడా దిగుమతులు తగ్గాయి.

News March 23, 2026

రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడి.. నేడు ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన

image

AP: అనకాపల్లి(D) నక్కపల్లి(M)లో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కు CM CBN ఇవాళ సాయంత్రం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి Dy.CM పవన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. దాదాపు రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడితో నిర్మించే ఈ ప్లాంట్ వల్ల 1.25L మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించి 2033కు పనులు పూర్తిచేయాలనేది లక్ష్యం.

News March 23, 2026

హార్ముజ్‌లో గర్జిస్తున్న పాత యుద్ధ విమానం

image

అమెరికా ఎయిర్ ఫోర్స్ రిటైర్ చేయాలనుకున్న పాత యుద్ధ విమానం ‘A-10 థండర్‌బోల్ట్’ (Warthog) ఇప్పుడు హార్ముజ్ జలసంధిలో ఇరాన్ స్పీడ్ బోట్లను వేటాడటంలో కీలకంగా మారింది. నిమిషానికి 3,900 రౌండ్లు కాల్చే దీని పవర్‌ఫుల్ గన్ శత్రువులకు వణుకు పుట్టిస్తోంది. ఆధునిక F-35 విమానాలు ఖరీదైనవి కావడంతో తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులను తట్టుకోగల ఈ ‘ఫ్లయింగ్ ట్యాంక్’ సామర్థ్యం ఇప్పుడు అమెరికాకు వరంగా మారింది.