News March 5, 2025

తణుకు మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు మృతి

image

AP: తణుకు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు(86) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. 1983 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఆయన గెలిచారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆయన మృతి పట్ల తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు సంతాపం తెలిపారు.

Similar News

News September 16, 2025

రూ.2 లక్షల వరకు ధరలు తగ్గింపు

image

ప్రీ GST, పండుగ డిస్కౌంట్ కింద కార్ల కంపెనీ కియా ఇండియా తెలుగు రాష్ట్రాల ప్రజలకు రూ.2 లక్షల వరకు ఆఫర్ ప్రకటించింది. సెల్టోస్ మోడల్‌పై రూ.2 లక్షలు, కారెన్స్ క్లావిస్‌పై రూ.1.33 లక్షలు, కారెన్స్‌పై రూ.1.02 లక్షల తగ్గింపు పొందవచ్చని పేర్కొంది. సెప్టెంబర్ 22 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఆఫర్ ఉందని, అయితే ధరల్లో మార్పు ఉంటుందని వెల్లడించింది.

News September 16, 2025

ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

image

TG: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్(TANHA) ప్రకటించింది. 323 ఆసుపత్రులకు ₹1,400 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని చెప్పింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామంది. మరోవైపు ఇటీవల ఇచ్చిన హామీ మేరకు ₹100 కోట్లు విడుదల చేశామని వైద్య వర్గాలు తెలిపాయి.

News September 16, 2025

1,543 ఇంజినీరింగ్ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1,543 పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు. ఇంజినీరింగ్‌లో కనీసం 55శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పని అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 29ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.