News March 5, 2025

నన్ను సస్పెండ్ చేసినా.. బీసీ ఉద్యమం ఆగదు: తీన్మార్ మల్లన్న

image

TG: తనను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన BC ఉద్యమం ఆగదని MLC తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. HYD ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పు అని, ఆ చిత్తు కాగితం తగలబెట్టడం తప్పా? అని ప్రశ్నించారు. కులగణన దేశానికి ఆదర్శంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. KCR సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా చేశారని, నూటికి నూరు శాతం చేస్తేనే సర్వే ఆదర్శం అవుతుందని తెలిపారు.

Similar News

News January 16, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 16, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.26 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.18 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 16, 2026

ఉద్రిక్తతల వేళ.. భారతీయులకు అలర్ట్

image

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. అవసరం లేని ప్రయాణాలు చేయొద్దని విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో భారత ఎంబసీ హెల్ప్‌లైన్‌ నెంబర్లను (+972-54-7520711, +972-54-3278392) సంప్రదించాలని పేర్కొంది. మరోవైపు ఇరాన్‌లోని భారతీయులను (10,000 మంది) స్వదేశానికి తరలించే ప్రక్రియను నేటి నుంచి ప్రారంభిస్తోంది.

News January 16, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.