News March 5, 2025
కంచిలి: జాతరలో పెళ్లి చూపులు

కంచిలి మండలం కుత్తుమ, కొక్కిలి పుట్టుగ గ్రామాల పరిధిలో గురువారం నిర్వహించే జామి జాతరకు సర్వం సిద్ధం చేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ మేరకు ఆలయాన్ని రంగులు, పూలమాలలతో అలంకరించారు. ఒడిశా సాంప్రదాయం గల ఈ గ్రామాలలో ఈ జాతర ద్వారా పెళ్లికాని యువతీ, యువకులకు చూపులు జరుగుతాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ జాతరలో ఇష్టపడిన వారితో పెద్దల అంగీకారంతో వివాహాలు జరుగుతాయని స్థానికులు నమ్మకం.
Similar News
News March 21, 2026
మందస : బైక్ యాక్సిడెంట్.. వ్యక్తి మృతి..!

మందస మండలం కొర్రాయిగేటు బ్రిడ్జి వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వజ్రపుకొత్తూరు(M) పూండిగోవిందపురానికి చెందిన లావేటి మనోజ్ (21) చికిత్స పొందుతూ మృతి చెందాడు. కార్పెంటర్ పనిచేసే మనోజ్ పని ముగించుకుని ఇంటికి వచ్చే తరుణంలో బైకు అదుపుతప్పి పడిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట్లు మందస ఎస్ఐ కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.
News March 21, 2026
శ్రీకాకుళం మెప్మా పీడీగా శైలజ

జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పథక సంచాలకురాలుగా శైలజ శుక్రవారం భాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా పి డి శైలజ మాట్లాడుతు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా భాద్యతలను నిర్వహించి సంస్థకు గుర్తింపు తీసుకువస్తానని అన్నారు. నూతన పీడీకు సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం పలాస డీడీపీఓగా పనిచేస్తూ బదిలీపై వచ్చారు. ప్రస్తుత పీడీ ఎస్.వెంకటరావు అభినందనలు తెలిపారు.