News March 5, 2025
డీల్ కుదిరినట్టేనా? జెలెన్‌స్కీ నుంచి ట్రంప్‌కు లేఖ

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ పంపిన లేఖ అందిందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చే మినరల్ డీల్‌పై నెగోషియేషన్‌కు ఆయన ఆసక్తి ప్రదర్శించారని అన్నారు. ‘రష్యా, ఉక్రెయిన్ వివాదం ఆపేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నా. ప్రతివారం రెండు దేశాలకు చెందిన వందలమంది మరణిస్తున్నారు. మరో ఐదేళ్లు యుద్ధాన్ని ఇలాగే కొనసాగనిద్దామా’ అని ప్రశ్నించారు.
Similar News
News March 6, 2025
మిల్లర్ సిక్స్.. బంతితో స్టేడియం నుంచి పరార్!

ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీఫైనల్లో విచిత్రమైన సంఘటన జరిగింది. సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ డీప్ కవర్ వైపు భారీ సిక్సర్ కొట్టారు. దీంతో బంతిని పట్టుకున్న ఇద్దరు వ్యక్తులు లాహోర్ స్టేడియం నుంచి బయటకు పరుగులు తీశారు. ఐసీసీ ఈవెంట్లో ఇలా జరగడం మొదటిసారి అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, టీమ్‌ను గెలిపించేందుకు మిల్లర్ చేసిన పోరాటం అనిర్వచనీయమని నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.
News March 6, 2025
ఎమ్మెల్సీగా నాగబాబు.. అంబటి సెటైర్లు

AP: ఎమ్మెల్యే కోటాలో జనసేన నేత <<15658136>>నాగబాబును<<>> ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు Xలో సెటైర్లు వేశారు. ‘అన్నను దొడ్డిదారిలో మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు. నాగబాబు, పవన్ కళ్యాణ్‌లను ట్యాగ్ చేశారు.
News March 6, 2025
తొలి 5 సెంచరీలు ఐసీసీ టోర్నీల్లోనే.. రచిన్ రికార్డ్

న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర వన్డేల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. తన తొలి 5 సెంచరీలనూ ఐసీసీ టోర్నీల్లోనే చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. 2023 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై 123*, ఆసీస్‌పై 116, పాక్‌పై 108, CT-2025లో బంగ్లాపై 112, నిన్న సౌతాఫ్రికాపై 108 రన్స్ బాదారు. కాగా ఇప్పటివరకు 32 వన్డేలు ఆడిన రచిన్ 44.29 యావరేజ్, 108.72 స్ట్రైక్ రేటుతో 1,196 పరుగులు చేశారు.