News March 5, 2025

కరీంనగర్: ఎమ్మెల్సీ కౌంటింగ్.. 23 మంది ఎలిమినేట్

image

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అధికారులు చేయనున్నారు. లెక్కింపునకు ముందు ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటికి 23 స్వతంత్ర అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Similar News

News November 10, 2025

విజయవాడలోని ఈ ప్రాంతాలపై దృష్టి సారించండి సార్.!

image

విజయవాడ బెంజ్‌సర్కిల్, ప్రభుత్వాసుపత్రి సర్వీస్ రోడ్ ప్రాంతాలు వ్యభిచారానికి అడ్డాగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ రాత్రి 8 గంటల నుంచి కొందరు మహిళలు రోడ్డుపై ఉంటూ ప్రజలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు. వీరు విటులను సమీపంలోని లాడ్జిలకు తీసుకువెళుతున్నారని, పలువురిని బెదిరించి నగదు దోచుకుంటున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. పోలీసులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News November 10, 2025

స్లీపింగ్ మాస్క్‌లు వాడుతున్నారా?

image

స్కిన్‌కేర్‌లో భాగంగా చాలామంది స్లీపింగ్ మాస్క్‌లు వాడటం ఎక్కువైంది. అయితే వీటిని ఎక్కువగా వాడటం నష్టమే అంటున్నారు నిపుణులు. ఈ మాస్కులు లైట్ క్రీమ్, జెల్‌తో ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. కానీ వీటిని రోజూ వాడటం వల్ల చర్మం ఎక్కువ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తుందంటున్నారు నిపుణులు. సహజ తేమను కోల్పోయి, మొటిమలు వచ్చే ప్రమాదం పెరుగుతుందంటున్నారు. వారానికి 2సార్లు వాడటం మంచిదని సూచిస్తున్నారు.

News November 10, 2025

శ్రీశైలంలో ఈనెల 14న కోటి దీపోత్సవం

image

AP: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో తొలిసారిగా ఈ నెల 14న కోటి దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఉచితంగా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. దీపోత్సవానికి అవసరమైన పూజా సామగ్రిని దేవస్థానమే అందజేస్తుందని పేర్కొన్నారు. ఇందులో పాల్గొనేందుకు పరిపాలన భవనంలోని శ్రీశైల ప్రభ కార్యాలయంలో 12వ తేదీలోపు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.