News March 5, 2025

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు న్యూజిలాండ్, సౌతాఫ్రికా మధ్య సెకండ్ సెమీ ఫైనల్ జరుగుతోంది. లాహోర్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిన్న జరిగిన తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియాపై ఇండియా గెలుపొంది ఫైనల్‌లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న విషయం తెలిసిందే.

Similar News

News March 4, 2026

RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>RITES<<>> లిమిటెడ్‌ 5 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు మార్చి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్, అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సర్వేయర్, CA/ICWA/CFA/MBA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. మార్చి 26, 27 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://rites.com/

News March 4, 2026

చర్చల ప్రసక్తే లేదు.. సుదీర్ఘ యుద్ధమే: ఇరాన్

image

చర్చలపై US అధ్యక్షుడు ట్రంప్ చేసిన <<19290770>>వ్యాఖ్యలపై<<>> ఇరాన్ స్పందించింది. అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని సుప్రీం నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ అలీ లరిజానీ స్పష్టం చేశారు. సుదీర్ఘ యుద్ధానికి తమను తాము సిద్ధం చేసుకున్నామని తెలిపారు. 2 దేశాల మధ్య డిస్కషన్స్ జరుగుతుండగానే ద్వేషంతో ట్రంప్ దాడులు చేశారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మండిపడ్డారు. అణు చర్చలను రియల్ ఎస్టేట్ లావాదేవీల్లా మార్చారని ఫైరయ్యారు.

News March 4, 2026

తమిళనాట DMK-INC సీట్ల పంచాయితీ కొలిక్కి!

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ DMK-INC మధ్య సీట్ల పంచాయితీ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. INCకి 28-29 స్థానాలతోపాటు ఓ రాజ్యసభ సీటు ఇచ్చేందుకు DMK చీఫ్ స్టాలిన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ డీల్‌కు INC చీఫ్ ఖర్గే కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇవాళ సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడనుందని పేర్కొన్నాయి. ఈసారి 35-40 సీట్ల కోసం కాంగ్రెస్ డిమాండ్ చేసిన విషయం <<19222432>>తెలిసిందే.<<>>