News March 5, 2025
వంశీని మరోసారి కస్టడీకి ఇవ్వండి.. పోలీసుల పిటిషన్

సత్యవర్ధన్ అపహరణ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని మరోసారి కస్టడీకి అనుమతించాలని విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును పోలీసులు కోరారు. ఆయన్ను మరింత విచారించాల్సిన అవసరం ఉందని, కేసు విషయమై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు 10రోజుల కస్టడీకి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 6, 2025
రంగన్న మృతిపై భార్య అనుమానం.. పోలీసుల దర్యాప్తు

AP: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న(85) <<15662269>>మృతిపై<<>> ఆయన భార్య సుశీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేని సమయంలో ఎవరో ఏదో చేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసుకుని పులివెందుల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాసేపట్లో ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
News March 6, 2025
‘ఎమ్మెల్సీ’ తీర్పుతో ప్రజావ్యతిరేకత అర్థమైంది: కిషన్ రెడ్డి

TG: సమష్టి కృషితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ నెరవేర్చలేదని, అందుకే ఆయనను ఎవరూ పట్టించుకోవట్లేదని ఎద్దేవా చేశారు. పాలకులు మారినా పాలన మారలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పుతో ప్రజావ్యతిరేకత అర్థమైందని తెలిపారు. విద్యావంతులు బీజేపీ వైపు నిలిచారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.
News March 6, 2025
‘RC16’.. జాన్వీ కపూర్ స్పెషల్ పోస్టర్

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ బర్త్ డే సందర్భంగా ‘RC16’ చిత్రయూనిట్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుండగా నిన్న కన్నడ నటుడు శివరాజ్ కుమార్ లుక్ టెస్టు పూర్తిచేశారు. త్వరలోనే ఈ సినిమా నుంచి అప్డేట్స్ రావొచ్చని సినీవర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఈ ఏడాది చివరిలోగా ‘RC16’ విడుదలయ్యే అవకాశం ఉంది.