News March 5, 2025
చీరాల: ప్రేమను నిరాకరించిందని యువతిపై దాడి

ప్రేమను నిరాకరించిందని ఓ యువతిపై తీవ్రంగా దాడి చేసిన ఘటన చీరాలలో జరిగింది. యువతి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. చీరాలలోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్న పూజేశ్, అదే కళాశాలలోని యువతిని ప్రేమించాలని వేధించేవాడు. అయితే యువతి ప్రేమను నిరాకరించడంతో స్థానిక సముద్రం వద్దకు తీసుకెళ్లి నీటిలో ముంచి, దాడి చేశారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన యువతికి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News September 16, 2025
NZB: 8 మందిలో ఆరుగురు పిట్లం వారే

నిజాం రజాకార్ల పాలన నుంచి తెలంగాణకు విమోచనం కల్పించడానికి పిట్లంలోని ఆరుగురు యోధులు అలుపెరగని పోరాటం చేశారు. వారిలో ఉప్పు లక్ష్మయ్య, నాగయ్య, లక్ష్మారెడ్డి, నారాయణ, లక్ష్మయ్య, నారాయణ, కృష్ణారావు, సుబ్బారావు ఉన్నారు. బాన్సువాడ డివిజన్ పరిధిలో 8 మంది ఉండగా వారిలో ఆరుగురు పిట్లం వాసులే కావడం విశేషం. నేటికీ బాన్సువాడ MRO కార్యాలయం ఎదుట ఉన్న శిలాఫలకంపై వారి పేర్లు చెక్కబడి ఉన్నాయి.
News September 16, 2025
రేపటి నుంచి మహిళలకు ఆరోగ్య పరీక్షలు: కలెక్టర్

మహిళలకు మెరుగైన ఆరోగ్య సేవలకై స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం రేపటి నుంచి అక్టోబర్ 2వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలో మొత్తం 65 హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్యాంపులలో మహిళలకు బీపీ, షుగర్, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లు, రక్తహీనత స్క్రీనింగ్ చేయనున్నారు.
News September 16, 2025
నందిగామలో గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి

నందిగామలో విద్యార్థిని నాగలక్ష్మి(18) గుండెపోటుతో మృతిచెందింది. అనాసాగరం గ్రామానికి చెందిన నాగలక్ష్మి నందిగామలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. సోమవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో కళాశాల నుంచి స్నేహితురాళ్లతో సదరు విద్యార్థిని బయటకు వచ్చింది. నడుస్తూనే ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయింది. ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.