News March 5, 2025
ADB: ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మందికి గాయాలు

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం గిరిజ గ్రామానికి చెందిన 16 మంది మహారాష్ట్రలోని చంద్రపూర్ మహంకాళి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బుధవారం మహారాష్ట్రలోని కోర్పణ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Similar News
News March 14, 2026
అనకాపల్లి: ఇంటర్ మొదటి ఏడాది పరీక్షకు 196 మంది గైర్హాజర్

అనకాపల్లి జిల్లాలో 31 కేంద్రాల్లో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 196 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు డీఐఈఓ వినోద్ బాబు తెలిపారు. మొత్తం 2,031 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 1,835 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా పకడ్బందీగా ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
News March 14, 2026
పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని బీ.ఏ., బీ.కామ్, బీఎస్‌సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ, బీఏ(ఎల్) (సీబీసీస్) కోర్సులకు సంబంధించిన II, IV & VI సెమిస్టర్ (రెగ్యులర్/బ్యాక్‌లాగ్/ఇంప్రూవ్‌మెంట్) పరీక్షల నోటిఫికేషన్‌ను పరీక్షల నియంత్రణాధికారి డా కె ప్రవీణ విడుదల చేశారు. విద్యార్థులు పరీక్ష ఫీజు, దరఖాస్తు ఫారమ్‌లను ఈనెల 30 లోపు, రూ.300 ఆలస్య రుసుంతో వచ్చే నెల 4 వరకు తమ కళాశాలల్లో చెల్లించవచ్చని తెలిపారు.
News March 14, 2026
ఒక్కరోజే 2,37,123 గ్యాస్ సిలిండర్ల పంపిణీ

TG: డొమెస్టిక్ సిలిండర్ల డెలివరీకి సమస్య రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా 2,37,123 గ్యాస్ సిలిండర్లు పంపిణీ అయ్యాయి. సాధారణంగా జరిగే రోజువారీ సగటు పంపిణీ కంటే ఇది 12K సిలిండర్లు అధికం కావడం విశేషం. IOCL 83,166, HPCL 88,257, BPCL 65,700 గ్యాస్ సిలిండర్లను సరఫరా చేశాయి. GOVT కఠిన చర్యల ఫలితంగా బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్టపడింది.


