News March 5, 2025
నిలువెల్లా రక్తం.. తల్లడిల్లిన తల్లి హృదయం..!

రోడ్డు ప్రమాదంలో ఆ తల్లికి తీవ్రగాయాలై నిలువెల్లా రక్తం కారుతోంది. అయినా సరే ఆ తల్లి హృదయం తన బిడ్డ కోసం తల్లడిల్లింది. తన బిడ్డకు ఏమైందోనని ఆమె పడిన ఆందోళన స్థానికులను కంటతడి పెట్టించింది. KMM జిల్లా <<15656275>>తనికెళ్ల వద్ద బస్సు బోల్తా<<>> పడిన ఘటనలో ఈ దృశ్యం కనిపించింది. బస్సులో ఉన్న తల్లాడ మండలం అన్నారుగూడెం వాసి బీరవెల్లి రాణికి రక్తం కారుతున్నా బిడ్డ కోసం వెతికింది. ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
Similar News
News March 6, 2025
ఖమ్మం మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

కాజీపేట–విజయవాడ మార్గంలో నిర్మిస్తున్న మూడో రైల్వే లైన్ పనులు నేపథ్యంలో ఖమ్మం మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసినట్లు ఖమ్మం రైల్వే అధికారి ఎం.డీ.జాఫర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 నుంచి 13 వరకు 8 రైళ్లను రద్దు చేశామని వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించి జిల్లా ప్రయాణికులు రాకపోకలు కొనసాగించాలని సూచించారు. ఎదైనా సమాచారం కోసం ఖమ్మం రైల్వే స్టేషన్లో సంప్రదించాలన్నారు.
News March 6, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} పెనుబల్లి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} నేలకొండపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
News March 6, 2025
ఖమ్మం కలెక్టర్ GREAT.. దివ్యాంగులకు ఉచిత భోజనం

పాలనలో తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకుంటున్నారు ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. విద్యార్థులు, ప్రజలతో మమైకమవుతూ వినూత్న శైలిని అనుసరిస్తున్నారు. సమస్యలపై కలెక్టరేట్‌కు వచ్చే దివ్యాంగులు ఖాళీ కడుపుతో వెళ్లొద్దనే భావనతో ఉచితంగా మధ్యాహ్న భోజనాన్ని బుధవారం నుంచి ప్రారంభించారు. 40 శాతం వైకల్యంతో ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో కలెక్టర్‌కు జిల్లావాసులు అభినందనలు తెలుపుతున్నారు.