News March 22, 2024

కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన కేసీఆర్

image

TG: ఢిల్లీ CM కేజ్రీవాల్‌ అరెస్టు దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో చీక‌టి రోజు అని మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ అన్నారు. ‘ప్ర‌తిప‌క్షాన్ని నామ‌రూపాలు లేకుండా చేయాల‌నే సంక‌ల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. దీనికి ఝార్ఖండ్ CM హేమంత్ సోరెన్, BRS ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘ‌ట‌న‌లు రుజువు. కేంద్రం ED, CBI, IT వంటి సంస్థ‌ల‌ను పావులుగా వాడుకుంటోంది’ అని కేసీఆర్ అన్నారు.

Similar News

News July 9, 2025

రేపు ‘బాహుబలి’ రీరిలీజ్ తేదీ ప్రకటన?

image

ప్రభాస్& రానా ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 1&2’ సినిమాలను ఒకేసారి రీరిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో రీరిలీజ్ అయ్యే ఈ చిత్ర తేదీని ప్రత్యేక పోస్టర్‌ ద్వారా రేపు ప్రకటించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘బాహుబలి’ రిలీజై రేపటికి 10 ఏళ్లు పూర్తికానుంది. కాగా, ‘బాహుబలి వస్తున్నాడు’ అని తాజాగా మేకర్స్ ట్వీట్ చేయడంతో దీనిపై ఆసక్తి పెరిగింది.

News July 9, 2025

ఆమెకు ఐఫోన్, రూ.లక్షల్లో డబ్బు ఇచ్చా: యశ్

image

తనపై ఆరోపణలు చేస్తున్న యువతికి ఐఫోన్, రూ.లక్షల్లో నగదు అప్పుగా ఇచ్చానని, కానీ ఇప్పటివరకు ఆమె తిరిగి ఇవ్వలేదని RCB బౌలర్ <<16985182>>యశ్ దయాల్ <<>>తెలిపారు. తన కుటుంబసభ్యుల చికిత్స పేరుతోపాటు, షాపింగ్‌కు కూడా తీసుకెళ్లి డబ్బులు కాజేసిందని ఆయన ఆరోపించారు. వీటన్నింటికీ తన దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు. పెళ్లి పేరుతో తనను వాడుకుని వదిలేశాడని యశ్‌పై ఓ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

News July 9, 2025

గుర్తుపట్టలేని లుక్‌లో స్టార్ హీరో

image

కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ నటిస్తున్న కొత్త మూవీ ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. తాజాగా ఈ సినిమాలో శివరాజ్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చేతిలో గన్ పట్టుకుని సీరియస్‌గా చూస్తున్న ఫొటోలో ఆయన గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ హేమంత్ రావు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వైశాక్ నిర్మిస్తున్నారు.