News March 5, 2025

నల్గొండ: నాన్నా.. నీ ప్రేమకు సలాం..!

image

ఆడబిడ్డ.. అందులోనూ దివ్యాంగురాలు.. ఆమెకు చదువెందుకులే అని ఆ తండ్రి అనుకోలేదు. దివ్యాంగురాలైతేనేం తన బిడ్డ సరస్వతి మాతకు ప్రతిరూపం అంటూ ఆ తండ్రి చెబుతున్నాడు.మర్రిగూడ(M) శివన్నగూడెంకు చెందిన సత్యనారాయణ, ధనమ్మ దంపతుల కూతురు మోర శివానికి ఫ్లోరసిస్ కారణంగా చిన్నప్పుడే కాళ్లు పనిచేయడం లేదు. నేడు మోడల్ స్కూల్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష రాసేందుకు తండ్రి తన బిడ్డను ఎత్తుకుని తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచారు.

Similar News

News March 15, 2026

నల్గొండ: అలర్ట్.. గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తుల సంచారం

image

అడవిదేవులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తులు తిరుగుతున్నారని పోలీసులు ఓ ఫొటోను రిలీజ్ చేశారు. బైక్‌పై వచ్చి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చానని చెప్పి, నీళ్లు కావాలని అడిగి ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళల మెడలోని బంగారం లాక్కొని పరారవుతున్నారని చెబుతున్నారు. బయటకు వెళ్లే వారు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే తమకు సమాచార ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

News March 15, 2026

జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ బి.చంద్ర శేఖర్

image

అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల వాణిజ్య గ్యాస్ నిల్వలు తగ్గినప్పటికీ, జిల్లాలో గృహ అవసరాల (Domestic) గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేదని కలెక్టర్ బి.చంద్ర శేఖర్ స్పష్టం చేశారు. శనివారం నిర్వహించిన “జిల్లా స్థాయి ఇంధన సరఫరా పర్యవేక్షణ కమిటీ” సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి గ్యాస్ కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.