News March 5, 2025

IT ఉద్యోగులకు మరో BAD NEWS

image

AI రాకతో నానా ఇబ్బందులు పడుతున్న IT ఉద్యోగులకు మరో పెద్ద కష్టమే వచ్చిపడింది. TCS, INFY, WIPRO, HCLTECH, ACCENTURE సహా మేజర్ కంపెనీలు బెంచ్‌సైజు, కాల పరిమితి తగ్గించాయని అన్‌ఎర్త్ ఇన్‌సైట్ తెలిపింది. FY20, 21లో 45-60 ఉన్న సగటు బెంచ్ డ్యురేషన్‌ ఇప్పుడు 35-45 రోజులకు తగ్గింది. మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 10-15% ఉండే బెంచ్ ఉద్యోగులు ఇప్పుడు 2-5%కు పడిపోయారు. మార్జిన్లు తగ్గడం, AI రావడమే ఇందుకు కారణాలు.

Similar News

News March 5, 2026

❤️నచ్చేశావ్ సంజూ..

image

T20WC: సంజూ శాంసన్ టీమ్ కోసం సెంచరీని కూడా లెక్క చేయలేదు. అతడు ఔటయ్యే సమయానికి భారత్ స్కోర్ 13 ఓవర్లలో 160గా ఉంది. అప్పటికే సంజూ 41 బంతుల్లో 89 రన్స్ చేశారు. సెంచరీ ముందు కూడా జట్టుకు భారీ స్కోర్ అందించాలని సిక్సర్ కోసం ట్రై చేశారు. అయితే మిస్ టైమ్ కావడంతో క్యాచ్ ఔటయ్యారు. సంజూ ఆరంభం నుంచి దూకుడుగా ఆడటంతో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లపై ఒత్తిడి పడలేదు. దీంతో భారత్ ఈజీగా 253 రన్స్ చేసింది.

News March 5, 2026

విరోష్ జంటకు సీఎం శుభాకాంక్షలు

image

TG: సీఎం రేవంత్ రెడ్డి నూతన దంపతులు రష్మిక-విజయ్ దేవరకొండను ఆశీర్వదించారు. రిసెప్షన్ సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం.. ఇవాళ విజయ్ నివాసానికి వెళ్లారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఫ్యామిలీతో కలిసి ఫొటో దిగారు.

News March 5, 2026

సెమీస్.. భారత్ భారీ స్కోర్

image

T20WC సెమీస్‌లో ఇంగ్లండ్‌పై టీమ్ ఇండియా 253/7 స్కోర్ చేసింది. అభిషేక్(9), సూర్య(11) విఫలమవగా, సంజూ శాంసన్ 89, ఇషాన్ 39, శివమ్ దూబే 43, తిలక్ 21, హార్దిక్ 27 రన్స్‌తో రాణించారు. విల్ జాక్స్, రషీద్ చెరో 2, ఆర్చర్ ఒక వికెట్ తీశారు. విజయం కోసం ఇంగ్లండ్ 254 పరుగులు చేయాలి. ఇవాళ గెలిచిన జట్టు ఈ నెల 8న ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో పోటీ పడుతుంది.