News March 5, 2025
ఏలూరు: రాజకీయ ప్రత్యర్థుల ఆత్మీయ అనుబంధం

సాధారణంగా రాజకీయాల్లో కానీ ఆటల్లో కానీ పోటీల్లో కానీ వ్యాపారంలో కానీ ఇలా ఏ రంగంలో అయినా ప్రత్యర్థులు అంటే ఒకరికి ఒకరు వ్యతిరేకంగా ఉంటారు. అయితే ఎమ్మెల్సీగా పోటీ చేసిన పేరాబత్తుల రాజశేఖర్ దిడ్ల వీర రాఘవులు వీరిద్దరూ పోటీపడ్డారు. అంతేకాక కౌంటింగ్‌లో కూడా వీరిద్దరి మధ్యనే పోటీ నెలకొంది. అయితే రాజశేఖర్ గెలిచాక స్నేహపూర్వక వాతావరణంలో కౌంటింగ్ సెంటరులో ఇరువురూ ఆత్మీయంగా నవ్వుతూ పలకరించుకున్నారు.
Similar News
News March 6, 2025
పోలవరంపై YCPకి మాట్లాడే అర్హత లేదు: షర్మిల

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు ప్రచారం అవాస్తవం అయితే కేంద్రంతో ప్రకటన చేపించాలని ప్రభుత్వాన్ని YS షర్మిల డిమాండ్ చేశారు. ‘పోలవరంపై YCPకి మాట్లాడే అర్హత లేదు. ఈ ప్రాజెక్టు పేరు వింటే YSR గుర్తుకొచ్చే మీకు.. 5 ఏళ్లు అధికారం ఇస్తే గాడిదలు కాశారా? నాడు తట్టెడు మట్టి అయినా తీశారా? ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు కుదించే ప్రతిపాదనకు ఒప్పుకుంది మీరు కాదా?’ అని ఆమె Xలో నిలదీశారు.
News March 6, 2025
పెదపాడు: సహజీవనం చేస్తున్న మహిళ కూతురిపై లైంగిక దాడి

తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి తన కుమార్తె(16)పై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ పెదపాడు మండలానికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై శారద సతీశ్ వివరాల ప్రకారం.. భర్తతో విడిపోయి ఇద్దరు కుమార్తెలతో ఉంటున్న మహిళ నాని అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. తన పెద్ద కుమార్తెపై ఇటీవల నాని లైంగిక దాడికి పాల్పడ్డాడన్న మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
News March 6, 2025
భయం లేకుండా చికెన్ తినండి: కలెక్టర్

ప.గో జిల్లా ప్రజలు ఎలాంటి భయం లేకుండా చికెన్ తినొచ్చని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం తణుకులో నిర్వహించిన చికెన్ మేళాలో ఆమె పాల్గొన్నారు. దాదాపు 10 వేల మందికి ఉచితంగా అందిచారు. ఫౌల్ట్రీ రైతులను రుణాల రీషెడ్యూల్‌కు ప్రయత్నిస్తామని కలెక్టర్, MLA రాధాకృష్ణ తెలిపారు. వేల్పూరు కృష్ణానందం కోళ్లఫారం, పెదతాడేపల్లిలో రామలక్ష్మి ఫారం నుంచి కి.మీ పరిధిలో మినహా జిల్లా మొత్తం చికెన్ తినొచ్చన్నారు.