News March 5, 2025

KMR: టీ ప్రైడ్ కింద 12 మందికి రాయితీ: కలెక్టర్

image

తెలంగాణ టీ ప్రైడ్, టీ పాస్ పెట్టుబడి రాయితీలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు టీజీ ఐ- పాస్ కింద 1370 దరఖాస్తులు రాగా, పరిశీలించి 1327 దరఖాస్తులను ఆయా శాఖల ద్వారా పరిశీలించి 1128 దరఖాస్తులు పరిశీలించి ఆమోదం తెలిపినట్లు కలెక్టర్ బుధవారం తెలిపారు.

Similar News

News July 7, 2025

మహబూబ్‌నగర్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

image

నిజాం ఏర్పాటు చేసిన హైదరాబాద్ రాష్ట్రంలోని ఈ ప్రాంతం ఓ జిల్లా. ఈ ప్రాంతాన్ని గతంలో “రుక్మమాపేట”/ “పాలమురు” అని పిలిచేవారు. అనంతరం 4 డిసెంబర్ 1890న (1869-1911AD) నిజాం మహబూబ్ అలీ ఖాన్ అసఫ్ జా-VI పాలమూరుకు మహబూబ్‌నగర్‌గా పేరు పెట్టారు. ఒకప్పుడు చోళవాడి” ​/“చోళుల భూమి” అని పిలిచేవారు. కోహినూర్” డైమండ్‌తో సహా ప్రముఖ “గోల్కొండ వజ్రాలు” జిల్లా నుంచి వచ్చాయని చరిత్రకారులు అభిప్రాయం. దీనిపై మీ కామెంట్..?

News July 7, 2025

పెద్దపల్లి: మహిళలు వేధింపులకు గురవుతున్నారా..?

image

వేధింపులు ఎదురైతే ఏం చేయాలి? ఎవరి సహాయం కోరాలి? ఇలా అయోమయంలో పడే మహిళలకు భరోసాగా మారుతోంది రామగుండం కమిషనరేట్ షీ టీం. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఈ బృందం నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళా చట్టాలు, రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై తెలియజేస్తోంది. వేధింపులు ఎదురైతే 6303923700 నంబర్‌కు ఫోన్ చేయాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైతే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News July 7, 2025

NRPT: తగ్గిన సర్పంచ్, MPTC స్థానాలు

image

నారాయణపేట జిల్లాలో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు కావడంతో సర్పంచ్, MPTC స్థానాలు తగ్గాయి. ప్రభుత్వం పలు గ్రామాలను విలీనం చేస్తూ కొత్తగా మద్దూరు మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. దీంతో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. 280 సర్పంచ్ స్థానాలు నుంచి 272, ఎంపీటీసీ స్థానాలు 140 నుంచి 136 కు చేరుకున్నాయి. వీటితోపాటు 13 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.