News March 5, 2025
స్టార్లు ‘రొమాన్స్’కు నో చెబుతున్నారు: గౌతమ్ మేనన్

తనకు స్టార్ హీరోలతో రొమాంటిక్ సినిమాలను తెరకెక్కించాలని ఉందని డైరెక్టర్ గౌతమ్ మేనన్ వెల్లడించారు. కానీ ఈరోజుల్లో ఇలాంటి మూవీస్ చేసేందుకు స్టార్లు ఆసక్తి చూపట్లేదని తెలిపారు. ‘నేను తమిళ, తెలుగు, కన్నడ హీరోలను సంప్రదించా. రొమాన్స్ అని చెప్పగానే వాళ్లు మీటింగ్‌ను వాయిదా వేయడం లేదా మళ్లీ కలవకపోవడం వంటివి చేస్తున్నారు. ఆలా ఎందుకు చేస్తున్నారో తెలియదు’ అని ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మాట్లాడారు.
Similar News
News February 9, 2026
394 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News February 9, 2026
గొర్రె, మేక పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గొర్రె, మేక పిల్లలు పుట్టాక వారం వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి నుంచి సరిపడా పాలు అందుతున్నాయా? లేదా? గమనించాలి. ఇది వాటి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెటర్నరీ డాక్టరు సూచన మేరకు దాణా అందించాలి. రెండు నుంచి ఐదు నెలల వరకు జొన్నలను దాణాగా ఇవ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మొక్కజొన్నలను పెట్టాలి. విటమిన్స్, కాల్షియం దాణాలో తగినంత ఉండేలా చూడాలి. పిల్లలకు 3 నెలల వయసులో డీవార్మింగ్ ప్రారంభించాలి.
News February 9, 2026
దీపాన్ని ఎలా వెలిగించాలంటే?

దీపారాధన చేసేటప్పుడు ముందుగా కుందుల్లో నూనె పోయాలి. ఆ తర్వాతే వత్తులు వేయాలి. వెండి, ఇత్తడి, మట్టి కుందులు వాడటం శ్రేష్ఠం. స్టీలు కుందులు అస్సలు వాడకూడదు. దీపపు కుందును నేరుగా నేలపై పెట్టడం మంచిది కాదు. పళ్లెం లేదా తమలపాకుపై ఉంచాలి. అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు. ఏకహారతి లేదా అగరవత్తి సాయంతో వెలిగించాలి. దీపానికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయడం వల్ల సంపూర్ణ ఫలితం లభిస్తుంది.


